టాలీవుడ్ లో విషాదం.. లిరిసిస్ట్ కందికొండ మృతి

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. సినీ గేయ రచయితగా సుమారు పన్నెండేళ్ళపాటు అనేక సినిమాలకు వందలసంఖ్యలో పాటలు అందించిన కందికొండ యాదగిరి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు.పూరి జగన్నాథ్ సూపర్ హిట్ సినిమా ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’లో ‘మళ్ళి కూయవే గువ్వా’ అనే పాటతో సినీగేయ రచయిత గా కెరీర్ మొదలుపెట్టిన కందికొండ యాదగిరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొందారు.

కందికొండ క్యాన్సర్ బారినపడడంతో సుమారు రెండేళ్ల పాటు క్యాన్సర్ కోసం కీమోథెరపీ చేయించుకున్నారు అయితే రెండేళ్ల పాటు కీమోథెరపీ చేయించుకోవడంతో ఆయన స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నాయి. ఆ మధ్య ఆర్థిక పరిస్థితి కూడా అసలు ఏమీ బాలేకపోవడంతో చిక్కిపోవడంతో ప్రభుత్వానికి సహాయం చేయమని కోరడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన ఆరోగ్యం నిమిత్తం అయ్యే ఖర్చు భరిస్తామని పేర్కొంది. కందికొండను తెలుగు చిత్ర పరిశ్రమకు దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి పరిచయం చేశారు.

ఎక్కువగా ఆయనకు పూరి జగన్నాథ్ అవకాశాలు ఇచ్చారు. అలా పూరి జగన్నాథ్ 143, పోకిరీ, ఇడియట్, చక్రం లాంటి సినిమాలకు గేయ రచయితగా సేవలందించారు. అంతేకాక తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడే విధంగా అనేక బతుకమ్మ పాటలను, తెలంగాణ పల్లె పాటలను రాశారు. చివరిగా ఆయన 2018 సంవత్సరంలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన నీది నాది ఒకే కథ సినిమాలో రెండు పాటలు రాశారు. కందికొండ మృతి చెందిన విషయం మీద టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Show comments