BJPలో చిచ్చు రాజేసిన తొలి విడత అభ్యర్థుల లిస్ట్!

BJPలో చిచ్చు రాజేసిన తొలి విడత అభ్యర్థుల లిస్ట్!

తెలంగాణ బీజేపీ కూడా మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ విడుదల చేసిన  తొలి విడత అభ్యర్థుల జాబితా ఆ పార్టీలు చిచ్చు రాజేసింది. టికెట్ ఆశించి భంగపడిన పలువురు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు

తెలంగాణ బీజేపీ కూడా మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ విడుదల చేసిన  తొలి విడత అభ్యర్థుల జాబితా ఆ పార్టీలు చిచ్చు రాజేసింది. టికెట్ ఆశించి భంగపడిన పలువురు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు

తెలంగాణలో ఎన్నిక వేడీ మొదలైంది. ఇక అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాను తయారు చేయడం, మార్పులు చేసే పనిలో పడ్డాయి. అయితే పార్టీలకు అభ్యర్థుల ఎంపిక కాస్తా తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో, కాంగ్రెస్ 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ కూడా మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ విడుదల చేసిన  తొలి విడత అభ్యర్థుల జాబితా ఆ పార్టీలు చిచ్చు రాజేసింది. టికెట్ ఆశించి భంగపడిన పలువురు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఎంతో కసరత్తు చేసి బీజేపీ అధినాయకత్వం తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే ఈ ఫస్ట్ లిస్ట్ ఆ పార్టీలో అసంతృప్తి చిచ్చు రగిలించింది. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా బీజేపీ టికెట్‌ ఆశించిన చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాలేదని ఆవేదన చెందుతున్న వాళ్లు కొందరైతే , కన్నీరు పెట్టుకున్నవాళ్లు మరికొందరు కనిపిస్తున్నారు. అంతేకాక కఠిన నిర్ణయాలు తీసుకుని బీజేపీ షాకిస్తున్నారు.

నిర్మల్ జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పార్టీకి రాజీనామా చేశారు. తాను ఆశించిన ముథోల్ టికెట్ దక్కకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ముథోల్‌ టికెట్‌ను బీజేపీ రామారావు పటేల్‌కు కేటాయించింది. రామారావ్‌ పటేల్‌ ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ముథోల్ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రమాదేవి ఈ పరిణామాన్నిజీర్ణించుకోలేక పోయారు. కన్నతల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని కన్నీరు పెట్టుకున్నారు.

అదే విధంగా సీనియర్‌ నేత, ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్‌ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి తన ఆవేదనను తెలియజేశారు. మరోవైపు పటాన్‌చెరు టికెట్‌ నందీశ్వర్‌ గౌడ్‌కు కేటాయించడాన్ని కొంత మంది బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పటాన్‌చెరు అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని పార్టీ నాయకత్వానికి నియోజకవర్గం పరిధిలోని 8 మంది మండల, డివిజన్‌ బీజేపీ అధ్యక్షులు సమావేశం నిర్వహించి అల్టిమేటం జారీ చేశారు.వరంగల్‌ వెస్ట్‌ స్థానాన్ని ఆశించిన రాకేష్‌ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కే మళ్లీ టికెట్‌ కేటాయించడంతో ఆ స్థానాన్ని ఆశించిన విక్రమ్‌ గౌడ్‌ నిరాశకు గురయ్యారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్సీ మోహన్‌ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపించారు. అలానే నర్సాపూర్‌, రామగుండం, ఆదిలాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. టికెట్ల విషయంలో పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరును ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు తప్పుబడుతున్నారు. బీ-ఫామ్‌ ఇచ్చే లోపు పునరాలోచన చేయాలని అధిష్టానాన్నికోరుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments