Dharani
SCR Cancelled 11 MMTS Trains In Hyderabad: హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణాలు చేసే వారికి కీలక అలర్ట్ జారీ చేసింది రైల్వే శాఖ. ఆ వివరాలు..
SCR Cancelled 11 MMTS Trains In Hyderabad: హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణాలు చేసే వారికి కీలక అలర్ట్ జారీ చేసింది రైల్వే శాఖ. ఆ వివరాలు..
Dharani
కొన్ని రోజుల క్రితం వరకు కూడా భారతీయ రైల్వే శాఖ.. దాని ఆధ్వర్యంలో పలు జోన్లలో నడుస్తోన్న అనేక రైళ్లను కొన్ని రోజుల పాటు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. ట్రాక్ అప్‌గ్రేడ్ వంటి పనుల వల్ల రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తాజాగా హైదరాబాద్ నగర వాసులకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు సంబంధించి కీలక అలర్ట్ జారీ చేశారు. ఇంతకు దేని గురించి అంటే..
హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. శని, ఆదివారాలు అనగా జులై 20, జులై 21 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు రోజులు సుమారు 11 ట్రైన్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రద్దయిన రైళ్ల వివరాలు, తిరిగి వాటిని ఎప్పుడు ప్రారంభింస్తారు అనే దానిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ లిస్ట్ మీ కోసం..
ఫలక్‌నుమా – సికింద్రాబాద్ (2 ట్రైన్లు), సికింద్రాబాద్ – ఫలక్‌నుమా (2 ట్రైన్లు), సికింద్రాబాద్ – మేడ్చల్, రామచంద్రాపురం – ఫలక్‌నుమా, మేడ్చల్ – సికింద్రాబాద్, హైదరాబాద్ – లింగంపల్లి, ఫలక్‌నుమా – హైదరాబాద్, లింగంపల్లి – ఫలక్‌నుమా, ఫలక్‌నుమా – రామచంద్రాపురం ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల తర్వాత తిరిగి ఈ సర్వీసులు పునరుద్ధరించబడతాయి అన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచించారు.
తాజాగా దక్షిణ మధ్య రైల్వే.. తెలంగాణలో వివిధ స్టేషన్లలో పలు రైళ్ల స్టాపేజీని ప్రారంభించింది. ప్రయాణికుల నుంచి దీనిపై ఎప్పటి నుంచో విజ్ఞప్తులు వెల్లువెత్తుతుండటంతో.. సౌత్ సెంట్రల్ రైల్వే.. ప్రయోగాత్మకంగా 69 రైళ్లకు స్టాపేజి (హాల్ట్)ని పొడిగించింది. ఈ ట్రైన్లకు తాత్కాలిక స్టాపేజిని కొనసాగిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 29 వరకు ట్రైన్లను బట్టి ఆ గడువు ముగియనుంది. ఇక హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచే భారీ వర్షం కురుస్తుంది. దాంతో ఎంతో ఉద్యోగాల కోసం వెళ్లేవారు, అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు మాత్రమే రోడ్ల మీద కనిపిస్తున్నారు. రేసు ఆదివారం కావడంతో.. ఎంఎంటీఎస్‌లలో ప్రయాణించే వారి సంఖ్య తక్కువగానే ఉండనుంది.