రోడ్డు పక్కన కంకులు కొన్న MLC కవిత.. సంబురపడ్డ నర్సమ్మ!

‘‘ఔ నర్సమ్మ ఎప్పటి సంది గీ కంకులు అమ్ముతున్నావ్‌.. దినాం ఎన్ని కంకులు అమ్ముడ్వోతాయి.. ఇంట్ల అందరూ మంచిగున్నర’’… ఏంది ఈ డైలాగ్‌లు చదివితే.. ఎవరో ఇద్దరు ఆత్మీయులు రోజు వారి ముచ్చట్లు పెట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది కదా.. కానీ కాదు. ఇలా కడుపు నిండుగా పలకరించిన వ్యక్తి.. తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక ఆమె ఇంత ఆత్మీయంగా పలకరించిన ఆ వ్యక్తి ఎవరంటే.. రోడ్డు పక్కన కూర్చుని.. మొక్కజొన్న కంకులు కాల్చి అమ్ముకుంటున్న మహిళ. ఈ ఆసక్తికర దృశ్యం మల్యాల మండలంలో చోటు చేసుకుంది.

రాజకీయ నాయకులు అంటే ప్రజలకు దూరంగా మంది మర్భాలంతో ఉండేవారు కాదు.. జనాలతో మమేకమవుతూ.. చిరునవ్వుతో వారిని పలకరిస్తూ.. వారిలో కలిసిపోయి.. వారి సమస్యలు తెలుసుకున్న వారే నిజమైన నాయకులు అవుతారు. అయితే ఇలా ప్రజలతో కలిసిపోవడం అందరు నేతల వల్ల కాదు. జనాల్లో ఎనలేని ప్రేమాభిమానాలు సంపాదించుకున్న వారు మాత్రమే వారితో కలిసిపోగలుగుతారు. ఈ విషయంలో కేసీఆర్‌ బిడ్డ కల్వకుంట్ల కవిత ముందు వరుసలో ఉంటారు. సీఎం కుమార్తె, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా ఎన్ని పదవులున్నా సరే.. సామన్య జనాలతో.. చాలా త్వరగా కలిసిపోతుంది కల్వకుంట్ల కవిత. ఏమాత్రం భేషజం లేకుండా వారితో కలిసిపోయి.. ఎంతో ఆత్మీయురాలిలా వారితో మాట్లాడతారు. తాజాగా ఇదే సన్నివేశం కనిపించింది.

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన ముగించుకుని.ప. తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారులో కాసేపు ఆగారు. ఆ సమయంలో అ‍్కడే రోడ్డు పక్కన ఓ మహిళ మొక్కజొన్నకంకులు కాల్చి అమ్ముతుంది. ఇది గమనించిన కవిత ఆమె వద్దకు వెళ్లి.. పలకరించింది. ఆ మహిళతో మాట్లాడుతూ.. ఆమె పేరు, ఊరు వివరాలు అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత వ్యాపారం ఎలా సాగుతుంది.. ఈ కంకులు మీ పొలంలో పండినవేనా.. బయట కొన్నారా అని ప్రశ్నించారు. రోజుకు ఎన్ని కంకులు అమ్ముతారు.. ఎంత లాభం వస్తుంది వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు కవిత. ఆ తర్వాత.. ఆమె దగ్గర కంకులు కొనుగోలు చేశారు. ఇక కవితను అక్కడ చూసిన స్థానికులు.. ఆమెతో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

Show comments