కోకాపేటలో ఎకరం 100 కోట్లు.. ఆ భూములకు ఎందుకంత క్రేజ్‌ అంటే!

రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా కోకాపేట పేరు మారుమోగుతోంది. ఎందుకంటే దేశంలో అత్యంత ధర పలికిన భూములు కోకపేట భూములు కావటం విశేషం. తాజాగా జరిగిన భూముల వేలంలో కోకాపేట భూములు షాకింగ్‌ ధర పలికాయి. ఒక్కో ఎకరా ఏకంగా 100.75 కోట్ల రూపాయల ధర పలికింది. భూములు ఇంత ధర పలకటం దేశంలో ఇదే మొదటిసారి. దీంతో కోకాపేట భూముల విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి భూముల్లో కొన్ని అత్యల్పంగా 67. 25 కోట్ల రూపాయల ధర పలికాయి.

గురువారం సర్వే నెంబర్‌ 239, 240లో ఉన్న 45.33 ఎకరాల్లోని భూమిని ఏడు ఫ్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. నిర్ణీత ధర 1586 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా.. మొత్తం 3,319 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ ఫ్లాట్లను కొనడానికి దిగ్గజ కంపెనీలు పోటీ పడ్డాయి. ప్రముఖ నగరాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఈ వేలంలో పాల్గొన్నాయి. అన్ని సదుపాయలు ఉన్న ఈ భూములను కొనడానికి తెగ ఆసక్తి చూపించాయి. హార్ట్‌ ఆఫ్‌ ది రియల్‌ ఎస్టేట్‌గా ఉన్న వెస్ట్‌ సిటీలో ప్రాజెక్టు ఉండటంతోటే ఈ స్పందన వచ్చినట్లు రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు తెలిపాయి.

కోకాపేట భూములకు ఎందుకింత క్రేజ్‌!

నగరంలోని కోకాపేట నియోపోలీస్‌ అద్భుతమైన హాట్‌ స్పాట్‌గా మారింది. దాదాపు 530 ఎకరాల్లో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ ఫీల్డ్‌ లేఅవుట్‌గా దీన్ని హెచ్‌ఎండీఏ అభివృద్ది చేసింది. గండిపేట చెరువు, ఔటర్‌ రింగురోడ్డు, ఐటీ కారిడార్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఇలా పక్కపక్కనే ఉన్నాయి. అంతేకాదు.. చుట్టూ చెరువులు, జలాశయాలతో ఎంతో సుందరంగా కోకాపేట నియోపోలీస్‌ లేఅవుట్‌ ఉంటుంది. రోడ్లు కూడా ఎంతో విశాలంగా ఉంటాయి. ఇక, కేబుల్స్‌ కూడా అండర్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయటం విశేషం. ఇక, దీన్ని చూడటానికి వచ్చే వారంతా ఆధునిక ఐటీ కారిడార్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, వందల కోట్ల రూపాయలు పలుకుతున్న కోకాపేట భూములపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments