Dr. Cheruku Sudhakar resigned from Congress: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డాక్టర్ చెరుకు సుధాకర్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డాక్టర్ చెరుకు సుధాకర్

కాంగ్రెస్ పార్టీ కీలక నేత డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డికి పంపారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు రాజకీయ నాయకులు షాక్ గురవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కీలక నేత డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డికి పంపారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు రాజకీయ నాయకులు షాక్ గురవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కీలక నేత డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డికి పంపారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు రాజకీయ నాయకులు షాక్ గురవుతున్నారు. అయితే ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ లో చేరిన ఆయన పార్టీలో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనేక బహిరంగ సభల్లో పాల్గొని పార్టీని సంస్థాగత ఎదుగుదలకు తన అనుభవాన్ని రంగరించి తోడ్పాటును అందించారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇదే కాకుండా పార్టీలో సామాజిక న్యాయంతో పాటు టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే నకిరికేల్ టికెట్ ఆశించి భంగపడ్డ చెరుకు సుధాకర్.. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీరుతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నల్గొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణ సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సుధాకర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బెనని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. కాగా, చెరుకు సుధాకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు. అనంతరం ఈ మధ్య కాలంలోనే సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నకిరికేల్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి చివరికి పార్టీకే రాజీనామా చేశారు. అయితే తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే చెబుతానని ఆయన తెలిపారు.

Show comments