Success Story: 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తెలంగాణ యువకుడు.. లిస్ట్ చూస్తే అవాక్కవుతారు

ప్రభుత్వ ఉద్యోగాలు సాదించాలని అందరికి ఒక కల.. దానికోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం ఒకటి రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన సక్సెస్ స్టోరీస్ తెలుసుకున్నాం. కానీ, ఇప్పుడు చూడబోయే సక్సెస్‌ స్టోరీ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే.. ఒకటి రెండు కాదు ఇతను ఒకేసారి 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.

ప్రభుత్వ ఉద్యోగాలు సాదించాలని అందరికి ఒక కల.. దానికోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం ఒకటి రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన సక్సెస్ స్టోరీస్ తెలుసుకున్నాం. కానీ, ఇప్పుడు చూడబోయే సక్సెస్‌ స్టోరీ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే.. ఒకటి రెండు కాదు ఇతను ఒకేసారి 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.

రోజు రోజుకు సమాజంలో డిగ్రీ పట్టాలు పొంది.. జీవితంలో ఎదో సాధించాలని.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే వారు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో.. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటేనే ఎంతో గొప్ప.. అటువంటిది కొంతమంది ఏళ్ళ తరబడి వేచి ఉన్నా సరే.. ఒకటికి రెండు,మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధిస్తున్నారు, ఇప్పటివరకు ఇలాంటి వార్తలను.. వారి సక్సెస్ స్టోరీస్ ను ఎన్నో చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సక్సెస్ స్టోరీ వింటే మాత్రం.. అందరు ఆశ్చర్యపోవాల్సిందే., ఎందుకంటే ఈ యువకుడు సాధించింది ఒకటి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ఏకంగా, ఒకేసారి 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మరి, ఈ యువకుడు సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన రమావత్‌ మధుసూదన్‌ అనే యువకుడు.. బీటెక్‌లో 60శాతం మార్కులతో పాసైన తరువాత.. ఒక సంవత్సరం పాటు బ్యాంకు ఉద్యోగం కోసం బాగా కష్టపడ్డాడు. కానీ, మొదటి ప్రయత్నంలో ఇతను విజయం సాధించలేకపోయాడు. అయినా సరే ఏ మాత్రం కృంగిపోకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.. ఈ క్రమంలో ఐబీపీఎస్‌, ఎస్‌బీఐతో పాటు ఇంకొన్ని బ్యాంక్ నోటిఫికెషన్స్ విడుదల అయ్యాయి. అతను అప్పటికే పరీక్షలకు రెడీ గా ఉండడంతో ..అతడు వెంట వెంటనే.. ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎస్‌బీఐలలో పీవో పోస్టులు.. ఎల్‌ఐసీ ఏఏవో, ఎన్‌ఐఏసీఎల్‌ ఏవో, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ మేనేజర్‌, ఎఫ్‌సీఐలో అసిస్టెంట్‌ గ్రేడ్‌-3, ఐడీబీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ, ఐడీబీఐ విభాగాల్లో క్లరికల్‌ ఉద్యోగాలు, ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ క్లరికల్‌, టీఎస్‌ క్యాబ్‌లో మేనేజర్‌ ఉద్యోగాలకు సెలక్ట్‌ అయ్యాడు.

ఈ క్రమంలో మొదట క్లర్క్‌, ఆ వెంటనే ఆఫీసర్‌ కేడర్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఎస్‌బీఐ పీవోగా కర్ణాటకలో కూడా ఎంపికవ్వడంతో అక్కడ ఉద్యోగంలో చేరాడు. అక్కడితో విశ్రాంతి తీసుకోకుండా.. ఆ తర్వాత.. తెలంగాణలో గ్రూప్‌ నోటిఫికేషన్లు విడుదల కావడంతో.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ ప్రిపేర్‌ కావడం మొదలుపెట్టాడు.. ఇప్పుడు దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్‌ సెంటర్లో చేరి.. ఎగ్జామ్స్ రాస్తూ.. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడంతో.. ఇలా వరుస విజయాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం ‘స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ – సీజీఎల్‌ (SSC CGL)’లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేరవుతున్నాడు ఈ యువకుడు. ఇక తల్లి దండ్రుల విషయానికొస్తే.. మధుసూధన్‌ తండ్రి పాండు వ్యవసాయం చేస్తుండగా.. తల్లి నాగమణి స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనందున.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇలా.. తన లక్ష్యం దిశగా అడుగులువేస్తున్నట్లు ఆ యువకుడు వెల్లడించాడు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments