New Budget 5G SmartPhone: వావ్ 10 వేలకే 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు కూడా..!

వావ్ 10 వేలకే 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు కూడా..!

5G Phone Under Rs10,000: ఫోన్ అనగానే అందరూ ఇప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్లలో కొనుగోలు చేస్తున్నారు. కానీ, అవి కాస్త ఖరీదుగా ఉంటాయి. ఇప్పుడు కేవలం 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.

5G Phone Under Rs10,000: ఫోన్ అనగానే అందరూ ఇప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్లలో కొనుగోలు చేస్తున్నారు. కానీ, అవి కాస్త ఖరీదుగా ఉంటాయి. ఇప్పుడు కేవలం 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లో 5జీ హవా నడుస్తోంది. కొత్త ఫోన్ అనగానే అందరూ 5జీ ఫోన్ నే కొనాలి అనుకుంటున్నారు. అయితే 5జీ ఫోన్ కొనాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. పండగ ఆఫర్స్ ఉంటే మినిమం ఫీచర్స్ ఉన్న ఫోన్ ని ఒక రూ.15 వేలకు కొనుగోలు చేయచ్చు. కానీ, ఇప్పుడు మార్కెట్ లోకి ఒక దేశీయ కంపెనీ కళ్లుచెదిరే లాంఛింగ్ ఆఫర్ తో 5జీ ఫోన్ విడుదల చేస్తోంది. అది కూడా కేవలం రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్ మీరు సొంతం చేసుకోవచ్చుద. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి.

దేశీయ కంపెనీ లావా ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసింది. సాధారణంగా లావా కంపెనీ ఫోన్లు తెలియని వాళ్లు ఉండరేమో. ఎందుకంటే ఫీచర్ ఫోన్లలో లావా కంపెనీకి చాలా మంచి పట్టు ఉంది. కానీ, స్మార్ట్ ఫోన్ ఎరా స్టార్ట్ అయిన తర్వాత లావా కంపెనీ బాగా వెనుకపడి పోయింది. అయితే ఫీచర్ ఫోన్లలో ఎలా అయితే బడ్జెట్ లో ఫోన్లను అందిచేవారో.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో కూడా అదే ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు. కేవలం రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అదికూడా సూపర్ స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు.

ఈ ఫోన్ 203 గ్రాముల బరువు ఉంటుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా, 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ని నవంబర్ 9 నుంచి కొనుగోలు చేయవచ్చు. మీ దగ్గర్లో ఉన్న మొబైల్ స్టోర్ నుంచి గానీ.. అమెజాన్ వెబ్ సైట్ నుంచి గానీ మీరు ఈ లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. మీకు ఈ ఫోన్ బాక్స్ లో అడాప్టర్, ఛార్జింగ్ కేబుల్ తో పాటుగా.. టీపీయూ కేసు కూడా లభిస్తుంది.

ఫీచర్స్:

  • 6.56 ఇంచెస్ హెచ్ డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే
  • 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియా టెక్ డైమెన్సిటి 6020 ప్రోసెసర్
  • అవుట్ ఆఫ్ ది బాక్స్ 13 ఓఎస్
  • 50ఎంపీ+ 0.8వీజియే కెమెరా
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రస్తుతం మార్కెట్ లో వివిధ రకాల కంపెనీల నుంచి బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లతో ప్రస్తుతం ఆఫర్స్ లో ఉన్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా శాంసంగ్ గ్యాలెక్సీ ఎం14 5జీ.. 6+128జీబీ 13,000, ఐకూ జడ్6 లైట్ 5జీ.. 6+128జీబీ 12,999, రెడ్ మీ 12 5జీ.. 4జీబీ+ 128 జీబీ 11,999గా ఉన్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, కొనుగోలు చేసేందుకు ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి.

Show comments