Tirupathi Rao
Allu Sirish Buddy Movie Review And Rating In Telugu: అల్లు శిరీష్ కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకుని.. ఈ బడ్డీతో తిరిగొచ్చిన విషయం తెలిసిందే. మరి.. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.
Allu Sirish Buddy Movie Review And Rating In Telugu: అల్లు శిరీష్ కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకుని.. ఈ బడ్డీతో తిరిగొచ్చిన విషయం తెలిసిందే. మరి.. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.
Tirupathi Rao
అల్లు శిరీష్ చాలా గ్యాప్ తర్వాత ఈ బడ్డీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ మూవీ టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు రేకెత్తించింది. మరి.. అదే థ్రిల్, ఎగ్జైట్మెంట్ ని థియేటర్లో కూడా కొనసాగించగలిగారా? ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత వచ్చిన చిత్రంతో అల్లు శిరీష్ ప్రేక్షకులను మెప్పించ గలిగాడా? తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.
ఆదిత్య (అల్లు శిరీష్) ఒక పైలెట్. పల్లవి (గాయత్రీ భరద్వాజ్) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లో ఉద్యోగిని. ఆదిత్య విధుల్లో ఉన్న సమయంలో తరచూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఆదిత్య- పల్లవి మధ్య పరిచయం పెరుగుతుంది. అయితే ఆదిత్యపై తనకు ఉన్న ప్రేమను తెలియజేయాలి అనుకుంటుంది. అప్పటి వరకు వాళ్లు కనీసం ఒకరిని ఒకరు చూసుకోరు కూడా. నేరుగా కలసి తన మనసులో మాట చెప్పాలి అనుకుంటుంది. కానీ, ఆమె చేసిన పొరపాటు వల్ల ఆదిత్యను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న పల్లవి ఎలాగైనా ఆదిత్యను కలిసి క్షమాపణలు అడగాలి అనుకుంటుంది. కానీ, అనుకోకుండా ఆమె అపహరణకు గురౌతుంది. ఆ క్రమంలోనే కోమాలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆమె బతికి ఉండగానే ఆమె ఆత్మ ఒక టెడ్డీ బేర్ బొమ్మలోకి వెళ్తుంది. అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? ఆత్మ ఎలా బొమ్మలోకి వెళ్లింది? దాని వెనుక ఉన్నది ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమాలో ఉన్న సోల్ పాయింట్ చాలా మంచిది. అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ మూవీలో ప్రతినాయకుడిగా అజ్మల్ ని ఎంచుకోవడం చాలా మంచి విషయం అని చెప్పాలి. అతని పాత్రతోనే కథను ప్రారంభించడం కూడా చాలా బాగుంది. ఎంతో పవర్ ఫుల్ క్యారెక్టర్ గా చూపించారు. అంతేకాకుండా ఒక టెడ్డీ బేర్ తో కలిసి హీరో పగ తీర్చుకోవడం కూడా బాగా ఆసక్తి రేకెత్తించే అంశం. మూవీ ఓపెనింగ్ కూడా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాగే కథ కూడా ఎంతో వేగంగా స్టార్ట్ అవుతుంది. అజ్మల్ పరిచయం.. తర్వాత హీరోయిన్ ఎంట్రీ.. హీరో- హీరోయిన్ పరిచయాలు.. ఆమె కోమాలోకి వెళ్లడం అన్నీ చకా చకా జరిగిపోతాయి. ఆ తర్వాత కథలో వేగం తగ్గిపోతుంది. బాగా నెమ్మదించడం స్టార్ట్ అవుతుంది.
ఈ మూవీ మొత్తంలో ఒక విషయం మాత్రం అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురించేస్తుంది. అదేంటంటే.. ఒక టెడ్డీ బేర్ కి ప్రాణం వచ్చి మనలో ఒకరిగా తిరుగుతూ ఉంటే అంతా ఆశ్చర్యపోతాం. కానీ, ఆ మూవీలో ఎవరూ ఆ టెడ్డీని అసలు పట్టించుకోరు. అయితే ఆ టెడ్డీతో డైలాగులు చెప్పించడం, యాక్షన్ సీక్వెన్స్ లో వాడుకోవడం మెప్పిస్తుంది. హీరోగా కూడా ఆ టెడ్డీ చెప్పిన కథకు ఎమోషనల్ అయిపోయి.. తన ప్రాణాన్ని కూడా రిస్క్ చేయడానికి రెడీ అయిపోతాడు. ఆ తర్వాత కథ మొత్తం హాంకాంగ్ కి చేరుకుంటుంది. అక్కడే అజ్మల్ ఆర్గాన్ మాఫియాతో హీరో తలపడతాడు. అయితే ఓపెనింగ్ లో చూపించినంత పవర్ ఫుల్ గా విలన్ పాత్ర లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. అలాగే పల్లవి శరీరాన్ని వెతికేందుకు హీరో ప్రయత్నాలు కూడా అంతగా ఆసక్తి రేకెత్తించవు. ఈ మూవీలో హీరోయిన్ ఆత్మ బొమ్మలోకి వెళ్లడం కూడా కొత్త పాయింట్ అనడానికి లేదు. ఎందుకంటే ఎందుకంటే ప్రేమంట సినిమాలో మనం ఇదే తరహా కథను చూశాం కాబట్టి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా సాగదీతగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఈ మూవీలో అల్లు శిరీష్ నటన మెప్పిస్తుంది. ఇన్టెన్స్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. విలన్ గా అజ్మల్ కాస్త పవర్ ఫుల్ గా కనిపించినా కూడా.. తర్వాత ఆ పాత్ర తేలిపోవడంతో ప్రేక్షకులు నిరాశ పడతారు. ఇంక హీరోయిన్ దగ్గరి నుంచి అలీ, ప్రిషా సింగ్, ముఖేశ్ రిషిలు.. వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. దర్శకుడు శామ్ ఆన్టోన్ ఈ మూవీలో చాలా కొత్తదనం చూపించాలి అని ప్రయత్నాలు చేశాడు. కానీ, అవి అంతగా మెప్పించలేదు అనే చెప్పాలి. పోరాట సన్నివేశాల్లో హిప్ హాప్ తమీజా సంగీతం మెప్పిస్తుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఎంతో రిచ్ గా ఉంటాయి.
చివరిగా: ఈ బడ్డీ కాస్త రొటీన్..
రేటింగ్: 2/5