Idream media
Idream media
అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఉద్యోగాల భర్తీలో ముందు వరుసలో నిలుస్తోంది ఏపీ సర్కారు. తొలి మూడు నెలల్లోనే సుమారు లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేసి సంచలనం రేకెత్తించింది. అంతేకాకుండా జాబ్ కేలెండర్ పేరుతో నిరంతర ఉద్యోగాల భర్తీపై దృష్టి కేంద్రీకరిస్తూనే ఉంది. తాజాగా.. గ్రూప్-1లో 110 ఉద్యోగాలు, గ్రూప్-2లో 182 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గురువారం ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రూప్-1లో ఉద్యోగాలు
డిప్యూటీ కలెక్టర్-10, వాణిజ్య పన్నుల అధికారి-12, జిల్లా రిజిస్ర్టార్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్-6, డీఎస్పీ-13, డీఎస్పీ జైళ్లు (పురుషులు)-2, జిల్లా అగ్నిమాపక అధికారి-2, ఆర్టీవో-7, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్-3, మున్సిపల్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్-1, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్2-8, డిప్యూటీ రిజిస్ట్రార్ కో-ఆపరేటివ్ సొసైటీస్-2, వైద్యశాఖలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి-15, ట్రెజరర్ గ్రేడ్2-5, ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ట్రెజరీ అధికారి-8, ఏఏవో-4, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి-1, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి-3, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి-1, ఎంపీడీవో-7 పోస్టులు ఉన్నాయి.
గ్రూప్-2లో ఉద్యోగాలు
డిప్యూటీ తహశీల్దార్-30, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్2-16, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్2-5, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్-10, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్-15, జీఏడీ సచివాలయంలో ఏఎస్‌వో-50, లా విభాగంలో ఏఎస్‌వో-2, లెజిస్లేచర్ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-4, ఆర్థిక శాఖలో సీనియర్ అకౌంటెంట్-10, జూనియర్ అకౌంటెంట్-20, సీనియర్ ఆడిటర్-5, ఆడిటర్-10, పౌరసరఫరాల శాఖలో జూనియర్ అసిస్టెంట్-5 పోస్టులు ఉన్నాయి.