Inner Ring Road Scam-Bhuvaneswari&Brahmani: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌.. భువనేశ్వరి, బ్రాహ్మణిల అరెస్ట్‌ తప్పదంటూ వార్తలు

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌.. భువనేశ్వరి, బ్రాహ్మణిల అరెస్ట్‌ తప్పదంటూ వార్తలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇక బాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆయన చేసిన అక్రమాలు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈకేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా ఉండగా.. నారా లోకేష్‌ని ఏ14గా చేర్చింది సీఐడీ. అంతేకాక ఏసీబీ కోర్టుకు సమర్పించిన మెమోలో కూడా సీఐడీ లోకేష్‌ని నిందితుడిగా పేర్కొంది. ఇలా ఉండగా.. తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌లో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిల అరెస్ట్‌ తప్పదు అనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాలు..

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ ఖరారులో భాగంగా.. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ లింగమనేని రమేష్‌ కుటంబంతో క్విడ్‌ప్రోలో భాగంగా భారీ భూదోపిడికి పాల్పడినట్లు సీఐడీ వెల్లడించింది. క్విడ్‌ ప్రో కో కింద చంద్రబాబు కరకట్ట​ నివాసాన్ని దక్కించుకోగా.. హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ హోదాలో లోకేష్‌ భూములు కొల్లగొట్టారని తెలిపింది. ఈ అవినీతి భూబాగోతాన్ని సీఐడీ దర్యాప్తు బృందం.. అన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. ఇక ఈ కేసులో సీఐడీ హెరిటేజ్‌ ఫుడ్స్‌ని చేర్చడంతో.. భువనేశ్వరి, బ్రాహణిల అరెస్ట్‌ తప్పదు అనే ప్రచారం సాగుతోంది.

అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ స్కామ్‌లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్న లోకేష్‌.. భారీగా భూదోపిడికి పాల్పడినట్లు సీఐడీ తెలిపింది. అయితే ఈ క్రిడ్‌ప్రోకో జరిగిన సమయంలో లోకేష్‌ కేవలం హెరిటేజ్‌ డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నారని.. కానీ ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి మేనేజ్‌మెంట్‌ హోదాలో ఉన్నారు. దాంతో.. ఈ కేసులో భువనేశ్వరి, బ్రాహ్మణి అరెస్ట్‌ అవుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

Show comments