Swetha
థియేటర్ లో విడుదల అయినా సినిమాలు దాదాపు నెలలోపే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పొలిటికల్ టచ్ తో వచ్చిన సినిమా యాత్ర-2 . ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.
థియేటర్ లో విడుదల అయినా సినిమాలు దాదాపు నెలలోపే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పొలిటికల్ టచ్ తో వచ్చిన సినిమా యాత్ర-2 . ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
టాలీవుడ్ లో పొలిటికల్ సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అంతేకాకుండ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాలకు మంచి ఆదరణ లభించడంతో.. దర్శకులు కూడా పొలిటికల్ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. రాజకీయ నాయకుల నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని.. వారి గురించి అందరికి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “యాత్ర 2”. 2019లో విడుదలైన చిత్రం యాత్రకు సీక్వెల్‌గా.. ఇప్పుడు దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 మూవీని తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఈ చిత్రం ఓటీటీ ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా యాత్ర-2 ఓటీటీ ఎంట్రీపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇంచుమించు కమర్షియల్ సినిమా రేంజ్‌లో.. ఈ పొలిటికల్ మూవీ యాత్ర-2 ను .. 30 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక సహజంగానే ఈ సినిమాపై ఉన్న భారీ హైప్ తో పాటు.. ఈ సినిమా విడుదల ముందు ప్రమోషన్స్ కూడా భారీగానే జరిగాయి. దీనితో ఈ సినిమా విడుదలైన మొదటి రోజునే రెండున్నర కోట్లవరకు కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఫస్ట్ వీక్‌లో ఏడుకోట్ల వరకు గ్రాస్‌ను, మూడున్నర కోట్ల షేర్‌ను రాబట్టింది. కాగా ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో.. కోలీవుడ్ నటుడు జీవా నటించగా.. మమ్ముటి గెస్ట్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన యాత్ర-2 ఓ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పి తీరాలి. అయితే, ఈ మధ్య కాలంలో విడుదలయ్యే సినిమాలు .. థియేటర్ రిలీజ్ కు ముందే ఓటీటీ లో అమ్ముడు పోతుంటే.. యాత్ర-2 గురించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి టాక్ రాలేదు. దానికి కారణం ఈ సినిమా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో ఉండడం వలన.. కాంట్రవర్సిసిస్ రావొచ్చేమో అనే భయపడుతున్నారట బయ్యర్స్. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీపై ఓ టాక్ వినిపిస్తోంది.
యాత్ర-2 సినిమాను కొనేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ .. మూవీ టీం ను సంప్రదించినట్లు ఇన్సైడ్ టాక్. ఒకవేళ ఈ న్యూస్ కనుక కన్ఫర్మ్ అయితే, మార్చి రెండవ వారం నుంచి యాత్ర-2 అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే యాత్ర-2 ఓటీటీ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. జగన్ జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన పదేళ్ల రాజకీయ పరిణామాలు, రూపుదాల్చిన వ్యవస్థల గురించి.. చాలా రియలిస్టిక్ గా చూపించాడు దర్శకుడు. ఇక ఈ సినిమా ఓటీటీ లో విడుదల అయిన తర్వాత.. ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, యాత్ర-2 ఓటీటీ ఎంట్రీపై వినిపిస్తున్న టాక్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.