OTT Suggestions- The Ministry Of Ungentlemanly War Fare: యాక్షన్ డ్రామాలు ఇష్టమా? OTTలో పిచ్చెక్కించే వార్ ఫేర్ డ్రామా!

యాక్షన్ డ్రామాలు ఇష్టమా? OTTలో పిచ్చెక్కించే వార్ ఫేర్ డ్రామా!

OTT Suggestions- The Ministry Of Ungentlemanly War Fare: యాక్షన్ మూవీస్, వార్ ఫేర్ డ్రామాలు గనుక మీకు ఇష్టం ఉంటే.. మీకు ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే స్కిప్ చేయడం కూడా కుదరదు.

OTT Suggestions- The Ministry Of Ungentlemanly War Fare: యాక్షన్ మూవీస్, వార్ ఫేర్ డ్రామాలు గనుక మీకు ఇష్టం ఉంటే.. మీకు ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే స్కిప్ చేయడం కూడా కుదరదు.

యాక్షన్ మూవీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ సినిమాలు అంటే పిచ్చి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హాలీవుడ్ నుంచి వస్తున్న యాక్షన్ డ్రామాలకు తెలుగు రాష్ట్రాల్లో అంత డిమాండ్ ఉంది. డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ కు హైదరాబాద్ లో భారీ కటౌట్స్ పెట్టారు అంటేనే యాక్షన్ చిత్రాలకు మన ప్రేక్షకులు ఎంత అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మూవీ లవర్స్ కోసం ఒక అదిరిపోయే యాక్షన్ డ్రామా తీసుకొచ్చాం. ఈ మూవీని స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ కి పిచ్చెక్కిపోతారు. అది కూడా అలా ఇలా కాదు.

సాధారణంగానే యాక్షన్ సినిమాల్లో ఫుల్ ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మూవీ చూస్తే మీరు అలాంటి ఎలివేషన్స్ అన్నీ మర్చిపోతారు. మీరు గనుక కేజీఎఫ్ లో ప్రశాంత్ నీల్ చూపించిన ఎలివేషన్స్ ని ఎంజాయ్ చేసుంటే.. మీకు ఈ సినిమా అంతకు మించి నచ్చేస్తుంది. ఒక దేశం మీదకు ఒక మ్యాడ్ గ్యాంగ్ ని పంపిస్తారు. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే.. దాని మూలాలను తెగ నరకాలి అని ఇంగ్లండ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుంది. వాళ్లు ఒక ఖైదీని పట్టుకుని ఒక మిషన్ ఇస్తారు. ఆ మిషన్ ఏంటంటే యుద్ధంలో ఇంగ్లండ్ గెలవడం కోసం కృషి చేయాలి. అయితే ఇది అనధికారిక మిషన్. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆర్డర్స్ కూడా ఉండవు. అలాగే వాళ్లు పట్టుబడితే ప్రాణాలు కూడా పోతాయి.

ఈ మిషన్ గురించి చెప్పినప్పుడు హీరో ఒక కండిషన్ పెడతాడు. తన టీమ్ తోనే తాను ఈ మిషన్ పూర్తి చేస్తాను అని చెప్తాడు. అయితే వాళ్లు అలాంటి ఇలాంటి వాళ్లు కాదండోయ్.. వైలెన్స్ అంటే వెర్రెక్కిపోతారు. ఒక్కొక్కరు వంద మందిని చంపే సామర్థ్యం ఉన్నవాళ్లు. ఈ మూవీలో మీకు యాక్షన్ సీక్వెన్స్ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. మూవీ అయిపోయిన తర్వాత కూడా ఆ విజువల్స్ మీ కళ్ల ముందే తిరుగుతూ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎదుకంటే ఇందులో బుల్లెట్లను చాక్లెట్లు పంచినట్లు పంచేస్తుంటారు. ఈ సినిమా పేరు మరేంటో కాదు.. “ది మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్ మ్యాన్లీ ఫార్ ఫేర్”. అంటే యుద్ధంలో అనైతిక చర్యలకు పాల్పడిన వాళ్లు అని అర్థం. అయితే ఈ మూవీని వాస్తవిక కథనాల ఆధారంగానే తెరకెక్కించాం అని చెప్పారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీరు ఈ మూవీ చూడచ్చు. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments