నెట్ ఫ్లిక్స్ ని ఊపేస్తున్న తెలంగాణ మహిళ క్రైమ్ కథ! అన్నీ ట్విస్ట్ లే!

Netflix Crime Thriller OTT Suggestions: ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామాలు ఎంటర్ టైన్ చేస్తున్నాయి. రియాల్టీ స్టోరీలను తమదైన స్టైల్లో ప్రజెంట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మొన్న కర్రీ అండ్ సెనైడ్ డాక్యుమెంటరీ చిత్రం వచ్చిన సంగతి విదితమే. ఇప్పుడు..

Netflix Crime Thriller OTT Suggestions: ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామాలు ఎంటర్ టైన్ చేస్తున్నాయి. రియాల్టీ స్టోరీలను తమదైన స్టైల్లో ప్రజెంట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మొన్న కర్రీ అండ్ సెనైడ్ డాక్యుమెంటరీ చిత్రం వచ్చిన సంగతి విదితమే. ఇప్పుడు..

తెలంగాణలోని నాగర్ కర్నూల్ స్వాతి రెడ్డి హత్య కేసు గుర్తుందా.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసి.. అతడి స్థానంలో ప్రియుడ్ని రప్పించేందుకు యాసిడ్ డ్రామా ఆడిన సంగతి విదితమే. 2017లో జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలోనే కాదూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఆ సమయంలో స్వాతి రెడ్డి పేరు వినబడగానే తిట్టుకోవడమే కాదూ భయాందోళనకు గురయ్యారు కొంత మందైతే. కానీ ఆమె వేసిన మాస్టర్ ప్లాన్..బెడిసి కొట్టడంతో జైలు పాలు అయ్యింది. ఇంతకు ఆ స్టోరీని పోలిన  ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ఇంతకు ఆ నాగర్ కర్నూల్ స్వాతి రెడ్డి కేసు ఏంటో ఓ సారి చూద్దాం.

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి, స్వాతిలదీ ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పనిచేసిన సుధాకర్..నాగర్ కర్నూల్‌కు మకాం మారి కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవాడు. హాయిగా సాగిపోతున్న సంసారంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. సుధాకర్ రెడ్డి తన పనులతో బిజీగా మారిపోయాడు. దీంతో భర్త తనను పట్టించుకోవడం లేదన్న ఉద్దేశంతో స్వాతి.. ఫిజియోథెరపిస్ట్ అయిన రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కానీ ఈ అక్రమ సంబంధం గురించి భర్తకు సుధాకర్ రెడ్డికి తెలిసిపోయింది. దీంతో భర్త అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. ప్రియుడు రాజేష్‌తో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ సెట్ చేసింది. దాన్ని అప్లై చేసింది. ఓ రోజు భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రియుడ్ని పిలిచి.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. అనంతరం అతని తలపై రాడ్‌తో కొట్టి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశారు.

ప్రియుడు రాజేష్‌ను .. సుధాకర్ రెడ్డిగా నమ్మించేందుకు ప్రయత్నాలు చేసింది. భర్త ప్లేసులో ప్రియుడ్ని తీసుకు వచ్చేందుకు యాసిడ్ దాడి నాటకం ఆడింది. ఇందు కోసం రాజేష్ తన ముఖంపై పెట్రోల్ చల్లుకుని నిప్పటించుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో అతడ్ని చేర్పించింది.ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. అయితే ఆసుపత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు.. అతడి ప్రవర్తన, ఆహారపు అలవాట్లలో తేడాలు గమనించారు. కానీ అతడు సుధాకర్ రెడ్డి కాదు అని నిరూపించలేకపోయారు. కానీ అతడ్ని మటన్ సూప్ పట్టించింది. యాసిడ్ దాడి బాధితుడైన రాజేష్ కు నయం కావాలంటే.. మటన్ సూప్ తాగితే మంచిదని భావించి.. సుధాకర్ తల్లి వండి తీసుకు రాగా, అతడు తాగేందుకు ఇష్టపడలేదు. దీంతో వారి అనుమానం మరింత బలపడింది. దీంతో అతడు సుధాకర్ కాదూ అని నిర్దారించారు.

ఎందుకంటే సుధాకర్ మాంసాహారి. అతడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అలాగే రాజేష్ శాఖహారి. అతడు మాంసాహారాన్ని తీసుకోడు. మటన్ సూప్ తీసుకురాగా, దాన్ని అతడు తాగకపోవడంతో ఇదే అతడ్ని పట్టించింది. దీంతో స్వాతిని అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం స్వాతి జైలులో ఊసలు లెక్కపెడుతోంది. ఇప్పుడు ఇదే స్టోరీని అటు ఇటుగా మార్చి.. బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్ రూపొందించారు. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేస్తోంది. అదే కిల్లర్ సూప్. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కథ ఇదే కానీ.. వేరే స్టైల్లో ప్రజెంట్ చేశాడు దర్శకుడు అభిషేక్ చౌబే. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో అలరించిన మనోజ్ భాజ్ పాయ్ ఇందులో నటించగా.. ప్రముఖ నటి, దర్శకురాలు కొంకణీ సేన్ శర్మ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ చూసినప్పుడు మీకు స్వాతి రెడ్డి స్టోరీ గుర్తుకు వచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments