ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. స్ట్రిమింగ్ ఎక్కడంటే?

Shahid Kapoor Movie Streaming OTT Platform: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అనగానే వెంటనే ఓటీటీ గుర్తుకు వస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తూ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Shahid Kapoor Movie Streaming OTT Platform: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అనగానే వెంటనే ఓటీటీ గుర్తుకు వస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తూ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కరోనా సమయంలో ధియేటర్లు మూసి వేత కారణంగా చాలా మంది ఓటీటీలో సినిమాలు, వెబ్ సీరీస్ చూడటం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు అందే కంటిన్యూ చేస్తున్నారు. ఓటీటీలో హర్రర్ జోన్, క్రైమ్ థ్రిల్లర్,కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని రకాల జోనర్లో సినిమాలు, వెబ్ సీరీస్ వస్తున్నాయి. భారతీయ చిత్రాలే కాదు.. ఇతర బాష చిత్రాలు, వెబ్ సీరీస్ కూడా అలరిస్తున్నాయి. కొంతమంది నిర్మాతలు డైరెక్ట్ గా తమ సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు చేసిన మూవీ సైలెంట్ గా ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతుంది.. ఎక్కడ అనే వియం గురించి తెలుసుకుందాం.

బాలీవుడ్ లో ‘తేరీ బాతోన్‌ మే ఐజా ఉల్జా జియా’ రొమాంటిక్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తేరీ బాతోన్‌ మే ఐజా ఉల్జా జియా మూవీలో జాన్వీ కపూర్ అతిథి పాత్రలో నటించింది. ఈ చిత్రానికి అమిత్ జోషి, ఆరాధన సాహ్ కలిసి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదట ఈ చిత్రంపై మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ తర్వాత అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. దాదాపు ఈ చిత్రం రూ.130 కోట్ల వరకు వసూళ్లు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా సైలెంట్ గా ఓటీటీలో దర్శనమిచ్చింది.

‘తేరీ బాతోన్‌ మే ఐజా ఉల్జా జియా’ మూవీ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్ గా డిజిటల్ వేదికగా స్ట్రిమింగ్ కావడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ మూవీ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే ఈ మూవీ ఎవరు పడితే వారు చూడలేరు.. ఎందుకంటే ఇది రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. కొన్నిరోజుల తర్వాత ఫ్రీగా చూసే అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. చాలా వరకు అమెజాన్ ప్రైమ్ ఇదే పద్దతిని ఫాలో అవుతుంది. వెంటనే చూడాలి అనుకునే వారు అద్దె తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది. లేదూ ఆలస్యంగా చూడాలి అనుకునేవారు కొంత కాలం ఆగితే సరిపోతుంది.

Show comments