YS Jagan – Chandrababu Delhi Tour : జగన్‌ ఆ విషయాన్ని వదిలేశారు..! బాబులో తారాస్థాయికి ఫ్రస్ట్రేషన్‌

వైఎస్‌ జగన్‌ నిఖార్సయిన రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై, అధికార పార్టీ ప్రజా వ్యతిరేక పాలనపై, హామీల అమలులో బాబు వైఫల్యంపై గళం విప్పిన వైఎస్‌ జగన్‌.. ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే ఏం చేయగలనో ప్రజలకు వివరించారు. ప్రజల ఆశ్సీసులతో అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వాన్ని ప్రజలకు చెంతకు తీసుకెళ్లడం, ప్రభుత్వ సేవలు సులువుగా అందించేందుకు విప్లవాత్మక చర్యలు చేపట్టడంతోపాటు.. ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే దృష్టి పెట్టారు.

ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేయాలని, అసభ్యకరమైన వ్యాఖ్యలతో రెచ్చగొట్టాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రయత్నించినా వైఎస్‌ జగన్‌ సంయమనం పాటిస్తూ.. తన లక్ష్యం వైపు సాగుతున్నారు. ప్రతిపక్షాన్ని ఎంత వరకు పరిగణలోకి తీసుకోవాలో అంత వరకే తీసుకుంటూ ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు కుట్రపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. పోలీసుల అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో, జగనన్న తోడు పథకం అమలు కార్యక్రమంలో మాట్లాడి ప్రజలను అప్రమత్తం చేశారు. టీడీపీ కుట్రలపై రెండు సార్లు మాట్లాడిన జగన్‌.. ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేశారు. పాలన, ప్రజా సంక్షేమంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.

ఈ రోజు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ యంత్రసేవా పథకాల ద్వారా 2,190 కోట్ల రూపాయులు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన సీఎం వైఎస్‌ జగన్‌.. రైతుల సక్షేమం పట్ల తమ ప్రభుత్వం ఏమేమి పనులు చేసింది తెలిపారు. ఇతర ఏ విషయంపై కూడా మాట్లాడలేదు. నిన్న సోమవారం చంద్రబాబు… ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌ ముందు మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్, స్టేట్‌ స్పాన్సర్‌ టెర్రరిజం..అంటూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా నోరు చేసుకున్నారు.

చంద్రబాబు ఈ తరహాలో దేశరాజధానిలో నానా యాగీ చేసినా.. జగన్‌ ఆ విషయంపై స్పందించకపోవడం విశేషం. ఎవరో ఏదో అంటున్నారని, వారి మాటలకు స్పందించి తిరిగి మాట్లాడడం మొదలు పెడితే.. మనం చేయాల్సిన పని ఆగిపోతుంది. ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరుతుందని పెద్దలు చెబుతుంటారు. పెద్దల మాట చద్దెన్నం మూట మాదిరిగా పరిగణించిన జగన్‌.. ఆ అవకాశం వారికి ఇవ్వలేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. తాను ఢిల్లీలో ఇంత గోల చేసినా.. సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించకపోవడంతో చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్‌ తారాస్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు.

Also Read : Chandrababu Mud Slashing- మీ రాజకీయాలకోసం రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీస్తారా బాబూ?

Show comments