CBN crying -సానుభూతి అప్ప‌టి వ‌ర‌కూ ప‌నిచేసేనా?

రాజ‌కీయ నాయ‌కులు ఏం చేసినా.. దాని వెనుక అధికార‌మే ప‌ర‌మావ‌ధి అంటారు. కులం, ధ‌నం లేకుంటే.. సానుభూతి ఇప్పుడు రాజ‌కీయాల‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్నాయి. కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడదా! అన్నా.. సీఎం పిల్లలే సీఎంలు కావాలా? అని నిలదీసినా.. రాష్ట్రాన్ని కులాల కుంపటి చేసేస్తున్నారని..నిప్పులు చెరిగినా.. ఆయన ఆర్థిక నేరగాడు అంటూ.. విమర్శలు గుప్పించినా.. ఏం చేసినా.. ప్రజల నుంచి సింపతీని దక్కించుకోవడమే నాయకుల ముఖ్య లక్ష్యం. కట్ చేస్తే.. ఇప్పుడు ఇవన్నీ.. ఎందుకు తలుచుకోవాల్సి వస్తోందంటే.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. ఆ క‌న్నీళ్ల‌కు అస‌లు కార‌ణాలు ఏంటి, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను నిందించ‌డం నిజ‌మేనా.. వంటి ప్రశ్న‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఆయ‌న భావోద్వేగం వెనుక పరమార్థం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి.

ఎందుకంటే.. ఇప్పుడు చంద్రబాబు ఏం చేసినా.. ఆయన సింపతీ కోసమే. అసలు పైన చెప్పుకొన్నట్టుగా.. రాజకీయాల్లో ఉన్నవారు ఏం చేసినా.. ఆఖరుకు ప్రజల నుంచి సానుభూతి పొందడం..తద్వారా లభించే ఓట్లతో అధికారంలోకి రావడమే. అయితే.. ఇప్పుడు చంద్రబాబు కన్నీళ్లు దాదాపు రెండున్నరేళ్లపాటు ఇంకిపోకుండా ఉండాలి! ఎందుకంటే.. ఇప్పుడు ఏర్పడిన సింపతీ ఫలించాలంటే.. ఓట్ల రూపంలో ఆయనకు సింపతీ.. రాలాలంటే.. మరో రెండున్నరేళ్ల వరకు రాష్ట్రంలో సార్వత్రిక సమరం లేదు. మధ్యలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. అంతేకాదు.. జగన్ మధ్యలోనే తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే ఉద్దేశం కూడా లేదు. సో.. ఇప్పుడు ఈ చంద్రబాబు కన్నీళ్లు.. ప్రజల్లో రెండున్నరేళ్లపాటు.. ఇంకిపోకుండా ఉండాలి. వారు రోజూ గుర్తు చేసుకోవాలి! మరి అప్పటి వరకు చంద్రబాబు ఏడుస్తూనే ఉంటారా? లేక.. ఏం చేస్తారు? అనేది ప్రశ్న.

ఎందుకంటే.. నిన్న జరిగింది ఈ రోజు… ఈ రోజు జరిగింది రేపు మరిచిపోతున్న కాలంలో ఉన్నాం. ఎవరి గోల వారిది! అన్న మాట వాస్తవం చేస్తున్న పరిస్థితుల్లో జీవితాలను వెళ్లదీస్తున్నాం. మరి చంద్రబాబు కార్చిన కన్నీటిని రెండున్నరేళ్లపాటు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎలా మరిచిపోకుండా ఉంటారో.. ఈ ఏపీ ప్రజలు చూడాలి. ఇక్క‌డ చెప్పుకోవాల్సిన మ‌రో విష‌యం ఏంటంటే.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి క‌న్నీళ్లు కార్చిన చంద్ర‌బాబు తెలంగాణ (హైద‌రాబాద్‌) కు వెళ్లిపోయారు.

Also Read : Chandrababu -అయ్యో.. పాపం చంద్ర‌బాబు!

Show comments