రుషికొండలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణాన్ని టీడీపీ ఎందుకు అడ్డుకుంటోంది..?

ఎవరిచ్చారు మీకు ఈ అధికారం.. అనే ఊకదంపుడు డైలాగ్‌ను ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తరచూ ప్రయోగిస్తుంటారు. ఇంగ్లీష్‌ మీడియం, మూడు రాజధానుల ఏర్పాటు వంటి విధానపరమైన నిర్ణయాలు సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్నప్పుడు చంద్రబాబు నోట వెంట ‘ ఎవరిచ్చారు మీకీ అధికారం’ అనే డైలాగ్‌ వచ్చింది. అధినేత తీరును బాగా వంటబట్టించుకున్నారో ఏమోగానీ.. టీడీపీ నేతలు కూడా చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. ప్రభుత్వం ఏం పని చేయాలి..? ఏం పని చేయకూడదో టీడీపీ నేతలు సలహాలు ఇస్తున్నారు.

విశాఖ రుషికొండలో పర్యటకశాఖ ఆధ్వర్యంలో ఉన్న పాత హరిత రిసార్ట్స్‌ స్థానంలో నూతనంగా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించాలనే ప్రతిపాదనలను జగన్‌ సర్కార్‌ చేపట్టింది. కార్యనిర్వాహఖ రాజధానిగా ఎంపికైనప్పుటి నుంచి విశాఖ అభివృద్ధిలో జగన్‌ సర్కార్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రిషికొండ బీచ్‌ వరకూ పలు పర్యాటక ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయిచింది. ఇందులో భాగంగానే రిషికొండలోని హరిత రిసార్ట్స్‌ స్థానంలో 91.27 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మాణాలు చేపట్టాలని సంకల్పంచింది. ఇందు కోసం పాత రిసార్ట్స్‌ను తొలగించే పనిని చేపట్టింది.

అయితే ఈ అంశంపై కూడా టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. విశాఖను ధ్వంసం చేయడమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారంటూ మాజీ మంత్రి బండారు సత్యానారాయణ, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు ఆరోపించారు. అందులో భాగంగానే హరిత రిసార్ట్స్‌ను కూల్చివేస్తున్నారని ఉదహరించారు టీడీపీ నేతలు. అక్కడ 15 నెలల్లో సకల సౌకర్యాలతో నిర్మించబోయే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ విషయాన్ని మాత్రం టీడీపీ నేతలు ప్రస్తావించడం లేదు. పైగా ఆ స్థలాలను ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు అక్రమంగా లీజుకు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ తమదైన శైలిలో ఓ ఆరోపణ చేశారు. పాత నిర్మాణాల తొలగింపు వద్ద వెళ్లి హడావుడి చేసిన నేతలు.. మీడియా ఫొటోలకు ఫోజులిచ్చి వచ్చేశారు. టీడీపీ నేతల బాధ హరిత రిసార్ట్స్‌ తొలగించారనా..? లేక దాని స్థానంలో వస్తున్న ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వల్ల.. తమ హోటళ్ల వ్యాపారానికి గండిపడుతుందనా..? అనే ప్రశ్నలు అధికార పార్టీ నుంచి వస్తున్నాయి.

Also Read : ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అసలు నిజాలేంటి, చంద్రబాబు పాత్రే ఏమీ లేదన్నట్టుగా రాతలెందుకు?

Show comments