iDreamPost
iDreamPost
సద్గురుగా ప్రపంచం మొత్తానికి తెలిసిన జగ్గీ వాసుదేవ్‌కు బైక్స్ అంటే చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బైక్స్ మీద తిరుగుతారు. బైక్ లను నడపడంలో కుర్రాళ్లకు ఆయన ఏం తీసిపోరు. ఆధ్యాత్మిక గురువుల్లో సద్గురు చాలా వినూత్నం. ఇటీవలే పర్యావరణ అవగాహనను ప్రచారం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా తిరిగారు. 30,000 కి.మీ. మేర జర్నీ చేశారు. అదీ బైక్ మీద. ఈ జర్నీకి సద్గురు ఎంచుకున్న బైక్ BMW K1600 GT. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆయన జర్నీ చేశారు. మిడిల్-ఈస్ట్ లో మాత్రం హోండా ఆఫ్రికా ట్విన్(Honda Africa Twin )ను పరుగులెత్తించారు. ఆయన దగ్గర ఎన్ని బైకులున్నా, సద్గురుకు BMW K1600 GTచాలా ఇష్టం. దీని బరువు 350 కిలోలు. ఇండియాలో లాంచ్ కాలేదు.
BMW K 1600 GT మరో వెర్షన్ K 1600 GTL ఆన్-రోడ్ ధర రూ. 30 లక్షలు. దాని ఒరిజన్ ధర రూ. 17 లక్షలే. ఇండియాకు దిగుమతి చేస్తే టాక్స్ వల్ల తడిపిమోడవుతుంది. సద్గురు ఉత్తర అమెరికా అంతటా ప్రయాణించడానికి ఈ బైక్‌ని ఎంచుకున్నాడు. ఈ ఒక్క బైక్ మీదనే 16,000 కి.మీ మేర జర్నీ చేశారు.
1.6-లీటర్, 6-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. రైడ్-బై-వైర్ సిస్టమ్‌తో నడుస్తుందికాబట్టి, క్విక్ గా రియాక్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఫీచర్ ఉంది. 200 కిమీ కంటే ఎక్కువ స్పీడు. ఈ దూకుడును తట్టుకొని ఆగడానికి dual-floating disc brakesను అమర్చారు.
సద్గురు నడుపుతున్న బైక్స్ లో ఇదే చాలా ఫేమస్. BMW K 1600 GT 350 కేజీల బరువున్నా స్ట్రెయిట్ హైవేలపై కంఫర్ట్ గా వెళ్తుంది. దేశాలను దాటి వెళ్లడానికి హైవే జర్నీలకు ఇది మంచి ఆప్షన్. కాలేజీ రోజుల్లో Yamaha RD 350ని వాడారు. దానిమీద దేశం మొత్తం తిరిగేవారంట. BMW R1200 GSకూడా సద్గురు దగ్గరుంది. అంతెందు సద్గురు బాబా రామ్ దేవ్ ని డ్యుకాటీ స్క్రాంబ్లర్ ఎక్కించుకొని తిరిగిన ఫోటో చాలా ఫేమస్.