హుజురాబాద్ ఓటరు ఎటువైపు.. ప్రభుత్వం వైపా… ఆత్మగౌరవం వైపా…

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఉప ఎన్నికలు సర్వసాధారణం. కానీ కొన్ని స్థానాలకు జరిగే ఎన్నిక మాత్రం ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో పొలిటికల్ పార్టీలన్నీ ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి. గెలుపు ఎవరిదన్న విషయం పక్కన పెడితే..నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పోటీ వాతావరణం స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

హుజురాబాద్ లో ఉప ఎన్నిక ఎందుకు…

మెదక్ జిల్లా మసాయి పేట గ్రామంలో జమున హచరిస్ కోసం అసైన్డ్ భూములు అక్రమించడాని రైతుల ఫిర్యాదుతో ఈటెల మీద ఎంక్వైరీకి ఆదేశించారు కేసీఆర్. తరువాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మంత్రి పదవిని కోల్పోయిన ఈటెల రాజేందర్ తర్వాత టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఈటెల రాజీనామాను వెంటనే ఆమోదించడంతో హుజురాబాద్ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆత్మగౌరవం పేరుతో టిఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అవమానం, అన్యాయాన్ని నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉపఎన్నికలకు సిద్ధం అవుతున్నారు ఈటెల.

ఈటెల పొలిటికల్ కెరియర్…
2003లో టిఆర్ఎస్ లో చేరిన ఈటెల 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. వైఎస్ ప్రభుత్వ సమయంలో టిఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా ఈటెల పని చేసారు. తరువాత నియోజకవర్గాల పునర్విభజన తరువాత2009 నుండి 2018 వరకు నాలుగు సార్లు హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 కేసీఆర్ క్యాబినెట్ లో తొలి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన ఈటెల 2018లో గెలిచిన తరువాత 2019లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.జూన్ 4న టిఆర్ఎస్ పార్టీకి,జూన్12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల జూన్14న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

Also Read:తేజ‌రాజుకు, కేటీఆర్ కు లింకేంటి? ఇప్పుడు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు దేనికి?

ఉప ఎన్నికలకు ఈటెల బీజేపీ సిద్ధం..

హుజురాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరి బిజెపి హుజురాబాద్ అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ను కలిసేందుకు పాదయాత్ర తో ప్రతి ఓటర్ ను కలిసి టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తనకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు.మొదట్లో కేసీఆర్ పై విమర్శలు చేయని ఈటెల క్రమంగా పాదయాత్రలో ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తనను ఓడించేందుకు అధికార పార్టీ నాయకులను డబ్బులతో కొంటుందని లొంగని వారిని కేసులతో బయపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. తనను ఓడించడం కేసీఆర్ జేజెమ్మ వల్ల కూడా కాదని… తనను గడ్డిపోచలా భావించారని కానీ ఇప్పుడు గడ్డపార అయ్యానని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

హుజురాబాద్ కేంద్రంగా టిఆర్ఎస్ రాజకీయం..

అధికార టిఆర్ఎస్ కూడా హుజురాబాద్ ఉప ఎన్నికలను సవాల్గా తీసుకుంది. ఇప్పటికే పలుమార్లు హుజురాబాద్ లో మంత్రులు టూర్ వేసి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ద్వితీయ శ్రేణి నాయకుల అందర్నీ టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారని స్వయంగా ఈటెల రాజేందర్ విమర్శలు చేయడం బట్టిచూస్తే టిఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇతర పార్టీ నేతలను టిఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తూ హుజురాబాద్ లో గెలుపు జెండా ఎగరేసి ఎందుకు టిఆర్ఎస్ రచిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వాడికి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.

తాజాగా రెండు సార్లు హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీమంత్రి, టిడిపి నుంచి బిజెపి లో చేరిన ఈ పెద్దిరెడ్డి ఈటెల రాకతో అసంతృప్తి వ్యక్తం చేస్తు బిజెపికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం కావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. హుజురాబాద్ బిజెపి టికెట్ ఆశించిన పెద్ద రెడ్డికి ఈటెల రాజేందర్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read:హుజురాబాద్, కోమటిరెడ్డి సర్వేలో ఆ పార్టీకి 5% ఓట్లే.. !

అయితే వచ్చే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున నిలబడే అభ్యర్థి ఎవరో తేల్చే లేకపోయినప్పటికీ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. నియోజకవర్గంలోని ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రభుత్వ పథకాలను హుజరాబాద్ లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గొర్రెల పంపిణీ, రైతుబంధు కొత్తగా దళిత బంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబాలకు 10లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం చేపట్టిన ఈ స్కీమ్ పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ను తీసుకోవడంతో రాష్ట్రం పొలిటికల్ చర్చ మొత్తం హుజురాబాద్ వైపే తిరిగింది.

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధువు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా కేసీఆర్ మాత్రం ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టిపారేసి పథకం అమలుకు స్కెచ్ గిస్తున్నారు. ఈ పథకం ద్వారా అమలు ద్వారా హుజురాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ లబ్ధి పొందితే తప్పేంటని స్వయంగా కేసీఆర్ విపక్షాలను ప్రశ్నించారు.

ఇతర పార్టీల పరిస్థితి ఏంటి..?

హుజురాబాద్ లో పోటీ టిఆర్ఎస్ బీజేపీ మద్యే అయినా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న తరువాత వస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో పోటీలో కాంగ్రెస్ కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ నుండి అభ్యర్థి ఎవరు..రేవంత్ రెడ్డి ఈ ఉపఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు అనేది కాంగ్రెస్ అందరి ముందున్న ప్రశ్న.
టీడీపీ,వామపక్ష పార్టీలు,ఇతర పార్టీలు ఉన్న ప్రజలు టిఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ వైపే చూస్తున్నారు.

ప్రజలు,స్థానిక నాయకుల అభిప్రాయం ఏంటి..?

హుజురాబాద్ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని టిఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుండగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాజీనామా చేయడంతోనే టిఆర్ఎస్ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తున్న అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో 40 వేల ఓట్లు ఉన్న దళితుల తమ వైపే రాజకీయ నాయకుల చూపు. వారిని తమవైపు తిప్పుకునేందుకు కెసిఆర్ ఇప్పటికే విందు రాజకీయం కూడా నడిపారు.ప్రభుత్వ పథకాల పేరు చెప్పి దళిత ఓట్లు మళ్లించుకుంటున్నారు టిఆర్ఎస్ నేతలు.

Also Read:జడ్జినే హత్య చేసిన ధన్‌బాద్‌ మాఫియా గ్యాంగ్

ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈటెల చాలా చిన్నవాడని ఈటెల రాజేంద్రతో వచ్చేది లేదు చచ్చేది లేదని తనుగుల ఎంపీటీసీ భర్తతో కేసీఆర్ ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో సంచలనం అయింది. సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్ గురించి మర్చిపోవాలని ప్రభుత్వ పథకాలను లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు.
స్థానికంగా ప్రజల్లో మిశ్రమ స్పందన కనిస్తుంది. ఈటెల రాజీనామతోనే తమ నియోజకవర్గానికి ప్రభుత్వం వరాలు కురిపోస్తుందని ఈటెలకె తమ మద్దతు అని కొంత మంది భావిస్తుండగా… ఈటెల అవినీతి ఆరోపణలు రుజువు చేసుకోకుండా అనవసరంగా ఉపఎన్నికల పేరుతో ప్రజాధనం వృధా అవుతుంది అని యువత విద్యావంతులు భావిస్తున్నారు.

ఏదేమైనా హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పొలిటికల్ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఈటెలకు,టిఆర్ఎస్ కు ఇద్దరికి గెలుపు ముఖ్యమే..

Show comments