Idream media
Idream media
కుప్పం మున్సిపాల్టీ ఫలితాలు టీడీపీకి కాస్త అటు, ఇటు అయితే ఆ పార్టీకి పెను ప్రమాదం తప్పేలా కనిపించడం లేదు. చెప్పుకోవడానికి చిన్న మున్సిపాలిటీయే అయినా అక్కడి గెలుపుపైనే టీడీపీ భవితవ్యం ఆధారపడిందన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గంలో కూడా వైసీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ఎగిరిపోతే బాబుకు చుక్కలే. అందుకే చిన్న మున్సిపాల్టీ కోసం ఏకంగా మాజీ ముఖ్యమంత్రి అంతలా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ కంటిమీద కునుకులేని వార్తలను వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ అంతర్ధానం అవడం ఖాయమని విజయసాయిరెడ్డి కచ్చితంగా తెగేసీ మరీ చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బలహీన స్థితికి చేరుకుంది. ఏపీలో ఏ ఎన్నిక జరిగినా వైసీపీకి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. ఆ పార్టీకి పోటీ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీ పని అయిపోయిందని చంద్రబాబు సహా అందరికీ తెలుసు అని కూడా సాయిరెడ్డి హాట్ కామెంట్స్ తాజాగా చేశారు. దాంతో టీడీపీలో ఉన్న బడా నాయకులు అంతా వైసీపీకి టచ్ లోకి వస్తున్నారని ఆయన అతి పెద్ద బాంబు పేల్చారు. వైసీపీలోకి వస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని కూడా ఆయన వెల్లడించడం విశేషం. అయితే వారితో చర్చలు జరుగుతున్నాయని ఆయన అంటున్నారు. అయితే ఎవరి పేర్లు చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచుతున్నారు.
Also Read : Kuppam Chandrababu -అప్పుడు మండలిలో.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు స్కెచ్ పారుతుందా
ఎన్నికలకు ముందు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీలోకి వెళ్తున్న బడా నాయకులు ఎవరు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. సాయిరెడ్డి చెప్పిన మాటలను కొట్టి పారేయలేమని కొంత మంది పసుపు నేతలు చర్చించుకుంటుండడం గమనార్హం. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని విజయసాయి రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ప్రకటించడం విశేషం. మరి టీడీపీ తీరు చూస్తే సార్వత్రిక ఎన్నికలు జరిగి మూడేళ్ల కాలం అవుతున్నా కూడా ఇంకా ఎక్కడా గట్టిగా పుంజుకోలేదు. వరసబెట్టి పలు ఎన్నికల్లో ఓటమి అంటే ఒక విధంగా ఏ పార్టీకైనా నైతిక స్థైర్యం దెబ్బ తినడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి పార్టీలో ఎవరుంటారు.
తాజా సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబు కూడా అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు ఫోన్ లో టచ్ లో ఉంటూ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి వైసీపీ గేట్లు తెరిస్తే ఎప్పుడో చాలా మంది టీడీపీ నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పట్టుబడుతున్న కొందరి ముఖ్య నేతలను మాత్రమే ఇప్పటి వరకు వైసీపీలో చేర్చుకున్నారు. వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. బహుశా ఆ బడానేతలు వైసీపీతో టచ్ లోకి రావడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.
Also Read : Special Status -ప్రత్యేక హోదాపై పట్టువీడని జగన్