Idream media
Idream media
జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి వేగవంతమైంది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో భాగంగా ఏపీ సర్కారు అవలంబిస్తున్న విధానాలతో సమప్రాధాన్యం లభిస్తోంది. కొందరు రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి.. కేవలం 29 గ్రామాలకు సంబంధించిన సమస్య ను భూతద్ధంలో చూపుతూ రాజకీయ ప్రయోజనాల కోసం ఆజ్యం పోస్తున్నారు. రైతులకు జరగాల్సిన న్యాయంపై ఆలోచించకుండా అనవసర రాద్దాంతాలు చేస్తున్నారు. ఈ ఆందోళనలపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖను పాలనా రాజధానిని కాపాడుకోవాలంటూ కొన్ని స్వచ్చంద సంస్థలు ప్రజా సంఘాలు ముందుకు వస్తున్నాయని చెబుతున్నారు. వీరంతా కలసి ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడతారు అని అంటున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో కూడా పాదయాత్ర సాగుతుందని అంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం అయిదేసి రోజుల పాటు పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ ని కూడా రెడీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు స్థానిక రాజకీయ నాయకుల మద్దతు కూడా కోరుతున్నారట. అయితే దీని మీద వైసీపీ నేతలు కూడా అంతర్గతంగా చర్చించుకున్నారని తాము బాహాటంగా మద్దతు ఇవ్వడం సబబు కాదని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పాదయాత్రను స్వచ్చంద సంస్థలే భుజానికెత్తుకునే ఆలోచనలో ఉన్నాయి.
మొత్తానికి ఉత్తరాంధ్రా పాదయాత్ర అయితే ప్రతిపాదన దశలో ఉంది. ఇది కార్యరూపం దాలిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో రాజకీయం ఏ తీరున మారుతుంది అన్న చర్చ కూడా వస్తోంది. ఇపుడు ఈ పాదయాత్ర మొదలైతే రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా టీడీపీకి చుక్కలు తప్పవు. స్థానికంగా విశాఖ ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే ఇక్కడ తుడుచుకు పెట్టుకుపోతుంది. మద్దతు ఇస్తే.. అమరావతి పేరుతో ఆడుతున్న నాటకాలు బహిర్గతం అవుతాయి. దీంతో అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తప్పవు. అనూహ్యంగా తెరపైకి వస్తున్న విశాఖ ఉద్యమం టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తోంది. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాలి.