వీడియో: స్మశానానికి తీసుకెళ్తుంటే… లేచి భయపెట్టిన బామ్మ!

వీడియో: స్మశానానికి తీసుకెళ్తుంటే… లేచి భయపెట్టిన బామ్మ!

పుట్టిన ప్రతి మనిషి మరణించగ తప్పదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం. అయినా కూడా తమ వారు మరణిస్తే.. ఆ కుటుంబ సభ్యులు రోదనలు వర్ణాతీతం. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చడం ఏవరి తరం కాదు. ఇక చనిపోయిన వ్యక్తి జ్ఞాపకాలు తల్చుకుంటూ మానసిక వేదనకు గురవుతుంటారు. అయితే చనిపోయారు అనుకున్న తమ వ్యక్తి…తిరిగి బతికితే.. అది కూడా స్మశానం వద్ద అలా జరిగితే.. ఇక కుటుంబ సభ్యులతో పాటు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అచ్చం అలానే  స్మశానం వద్దకు వెళ్లే సరికి చనిపోయిందనుకున్న బామ్మ లెచి నిలబడింది.

ఓ ముసలావిడకు ఆరోగ్యంగా బాగా లేకుంటే.. ఆమె కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఇటీవలే ఆరోగ్యం విషయమించి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అంతేకాక ఆమె చనిపోయిన వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆస్పత్రి రూల్స్ ప్రకారం… తెల్లటి వస్త్రంలో చుట్టు ఆ ముసలావిడను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలానే ముసలావిడ కుటుంబ సభ్యులు కూడా తమ పద్ధతుల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని ఓ పెట్టేలో ఉంచి.. స్మశానానికి తరలించారు. అక్కడ ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆమెలో కదలికలికలు కనిపించాయి. కాసేపటికి పెద్ద స్వరంతో ఒక్కసారిగా  శ్వాస తీసుకుంది.

దీంతో పక్కనే ఉన్న ఆమె కుటుంబ సభ్యులు తొలుత ఆశ్చర్యపోయారు. వెంటనే అప్రమత్తమయ్యయి..అబులెన్స్ లో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు తగిన చికిత్స అందించారు. ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆ ముసలావిడ కుటుంబ సభ్యులు సంతోషంగా వ్యక్తం చేశారు.  స్మశానం వద్ద… తనను ఎందుకు ఇక్కడికి  తీసుకొచ్చారంటూ ఆమె.. కుటుంబ సభ్యులను ప్రశ్నించింది. ఆమెకు ఏం సమాధానం చెప్పలేక వారు తెల్ల ముఖాలు వేశారు. అయితే చనిపోయిందనుకున్న బామ్మ తిరిగి రావడంతో స్థానికలు సైతం ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments