Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి క్రెడిట్ హైజాకింగ్ చర్యలకు తెరలేపారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సాయి తేజ కుటుంబానికి కోటి రూపాయల నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సాయి తేజ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
సాయం చేయడం జగన్‌తోనే మొదలైంది..
దేశ రక్షణలో జవాన్లు అమరులు అయితే.. వారి కుటుంబాలకు మునుపెన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ అండగా ఉంటోంది. జవాను కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తోంది. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ రెడ్డికి జగన్ సర్కార్ 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. వీర జవాను మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఇలాంటి కష్ట సమయంలో ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉంటుందనే ఆశతో ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ మొత్తం అందిస్తున్నామని జగన్ ప్రకటించారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వీర జవాన్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి సతీమణి రజితకు లేఖ రాసి భరోసా కల్పించారు.
అదే విధంగా ఈ ఏడాది జూలైలో కశ్మీర్‌లో ప్రాణాలు అర్పించిన బాపట్లకు చెందిన వీర జవాను జస్వంత్ రెడ్డి కుటుంబానికి కూడా సీఎం వైఎస్ జగన్ 50 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. సాయితేజ భౌతికకాయం స్వగ్రామానికి వచ్చిన తర్వాత.. సాయంపై ప్రకటన చేయడం, చెక్ అందించడం షరామామూలే.
డిమాండ్ సరే.. బాబు ఏమిస్తున్నారు..?
సందర్భం ఏదైనా తనకు పేరు వస్తుందనుకుంటే.. ముందుండే చంద్రబాబు.. సాయితేజ కుటుంబానికి పరిహారం విషయంలోనే అదే తీరున వ్యవహరించారు. రాసిన లేఖ కూడా ముఖ్యమంత్రికి కాకుండా.. ప్రధాన కార్యదర్శికి రాయడంలోనే చంద్రబాబు చిత్తశుద్ధి తెలుస్తోంది. ఓ వైపు సాయి తేజ కుటుంబాన్ని ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. సినీ నటుడు మంచు విష్ణు సాయితేజ ఇద్దరు పిల్లల చదువుల బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ వరకూ పిల్లలిద్దరికీ ఉచితంగా విద్యనందిస్తామని చెప్పారు. నిజంగా సాయితేజ కుటుంబంపై సానుభూతి ఉంటే.. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపునో లేదా టీడీపీ తరపునో ఏదో ఒక సాయం ప్రకటించేవారు. ఈ పని చేయకుండా.. ప్రభుత్వం ఎలాగూ చేసే పనిని.. చేయాలంటూ లేఖ రాయడం చంద్రబాబు రాజకీయానికి పరాకాష్ట.
గతంలో జవాన్లు మరణిస్తే.. వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడం వరకే ఉండేది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఈ విధానంలో మార్పు వచ్చింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడమే కాదు.. ఆ జవాను కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఉద్యోగం ఇచ్చి అండగా ఉండే చర్యలు తక్షణమే చేపడుతున్నారు. గతంలోనూ జవాన్ల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం సాయం చేసిన విషయం చంద్రబాబుకు తెలుసోలేదో..?