శాస్త్ర‌వేత్త‌ల అల‌ర్ట్ : ఈ నెల చివ‌రి వారంలో క‌రోనా పీక్స్ కు చేరుతుంద‌ట‌.!

దేశంలోకి థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయిందని చెప్ప‌డానికి పెరుగుతున్న కేసులే ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి. జ‌న‌వ‌రి చివ‌రి వారంలో లేదా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతాయి. అయితే, ముంబై, ఢిల్లీ వంటి మ‌హాన‌గ‌రాల్లో ప్ర‌తిరోజూ కేసులు పీక్స్‌లో న‌మోద‌వుతున్నాయ‌ని, జ‌న‌వ‌రి మిడిల్ వ‌రకు 30 వేల నుంచి 60 వేల మ‌ధ్య‌లో కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఐఐటి కాన్పూర్ శాస్త్ర‌వేత్త మ‌హీంద్రా అగ‌ర్వాల్ పేర్కొన్నారు. కేసుల‌తో పాటు ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య‌కూడా పెరుగుతుంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఆసుప‌త్రులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల‌ని, ఆక్సీజ‌న్, బెడ్స్ సౌక‌ర్యాలు ఏర్పాటు చేసుకోవాల‌ని ఐఐటి కాన్పూర్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఇక దేశంలో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 15 వ‌ర‌కు దేశంలో థ‌ర్డ్ వేవ్ పీక్స్‌కు చేరుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు ఐఐటి మ‌ద్రాస్ అంచ‌నా వేసిన సంగ‌తి తెలిసిందే. దేశంలో థ‌ర్డ్ వేవ్ పీక్స్‌కి చేరుకుంటే రోజుకు 4 నుంచి 8 ల‌క్ష‌ల వ‌ర‌కు కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

పాజిటివ్‌ పరేషాన్‌ : ఇద్దరు ముఖ్యమంత్రులు.. అగ్రనేతలు, నటులు, ఇంకా..

మొదటి, సెకండ్‌ వేవ్‌ తరహాలోనే.. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతోంది. అగ్ర నేతలు, ముఖ్యమంత్రులు సహా దేశంలో పలువురు ప్రముఖులు కరోనా బారినపడ్డారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై, బీహార్  సిఎం నీతీశ్‌ కుమార్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీపీఎం అగ్ర నేతలు ప్రకాశ్‌ కారత్, బృందా కారత్ లకు సోమవారం పాజిటివ్‌ వచ్చింది.

బహుభాషా నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ, నటి, నర్తకి శోభనకూ వైరస్‌ నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో కరోనా సోకిన నాలుగో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌. వారం క్రితం భారతి ప్రవీణ్‌, మహేంద్రనాథ్‌ పాండే, నిత్యానంద రాయ్‌లకూ పాజిటివ్‌ వచ్చింది. కొన్ని రోజుల కిందట రాజస్థాన్‌, ఢిల్లీ సీఎంలు అశోక్‌ గెహ్లోట్, అరవింద్‌ కేజ్రీవాల్‌కూ వైరస్‌ సోకింది. కాగా, రాజ్‌నాథ్‌, బొమ్మై తమకు లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు ప్రకటించారు. ముందుజాగ్రత్త డోసు పంపిణీ ప్రారంభం సహా బొమ్మై సోమవారం కర్ణాటకలో వివిధ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. మరికాసేపటికే ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. ఇక నడ్డా ఈ నెల 6న తెలంగాణలో పర్యటించారు. ర్యాలీతో పాటు పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా సమావేశాల్లో పాల్గొన్నారు. మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు.

Also Read : థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ సిద్ధమైందిలా..!

Show comments