Solar Power, Payyavula Keshav – సమస్యే లేదు… సోలార్ విద్యుత్ లో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తక్కువకే కొన్నాం

ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ఆఫర్ మేరకే రూ. 2.49కు విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది అని ఆయన మీడియాకు వివరించారు. రూ. 2.49కు అదనంగా నెట్ వర్క్ ఛార్జెస్ ఉంటాయి అని తెలిపారు.

నెట్ వర్క్ ఛార్జెస్ సుమారుగా రూ. 1.61 ఉండే అవకాశం ఉంటుందన్న ఆయన సెకీ నుంచి విద్యుత్ కొనుగోళ్లల్లోనే కాదు.. ఏ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలోనైనా నెట్ వర్క్ ఛార్జెస్ ఉంటాయి అని వివరించారు. రైతుల కోసం ఉచిత విద్యుత్ అందించే ఉద్దేశ్యంతో సెకీతో ఒప్పందం చేసుకుంటున్నామని డిస్కంలపై పడే నెట్ వర్క్ ఛార్జెస్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని స్పష్టం చేసారు. తమిళనాడు ప్రభుత్వం గడచిన సెప్టెంబరులోనే సెకీ నుంచే రూ. 2.61కు విద్యుత్ కొనుగోలు చేసింది అని ఆయన పేర్కొన్నారు.

రూ. 2.49 కంటే తక్కువగా సెకీ ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ఆఫర్ ప్రభుత్వం దృష్టిలో లేదు అని స్పష్టం చేసారు. 2014 నుంచి ఏపీ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో సెకీ ఆఫరే అతి తక్కువ అని విపక్షాలకు క్లారిటీ ఇచ్చారు. కేంద్ర విద్యుత్ చట్టం ప్రకారమే సెకీ ఏపీకి రూ. 2.49కు ఆఫర్ ఇచ్చింది.. ఏపీ ప్రభుత్వం ఆమోదించింది అని తెలిపారు. కేంద్ర సంస్థ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి.. జుడిషియరీ ప్రివ్యూకు.. రివర్స్ టెండరింగుకు వెళ్లాల్సిన అవసరం లేదు అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశం ముందుగా ప్రభుత్వం నిర్ణయించి.. ఆ తర్వాత ఈఆర్సీకి ప్రతిపాదిస్తుంది అని తెలిపారు.

ఈఆర్సీ ఆమోదం అనంతరమే సెకీతో ఒప్పందం చేసుకున్నామని ఛేంజ్ ఆఫ్ లా ప్రకారం ఛార్జీలు పెరిగినా డిస్కంలే భరిస్తాయి అని స్పష్టం చేసారు. ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంటు నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఎవాక్యువేషన్ లైన్లు వేయాల్సి ఉంటుంది అని వివరించారు. సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి.. ఇప్పుడు ఎవాక్యువేషన్ లైన్ల ఖర్చు ఉండదు అన్నారు. ప్రభుత్వం నిర్ణయించింది.. ప్రభుత్వ ఉద్యోగిగా నేను వాటిని అమలు చేయాలి అని స్పష్టం చేసారు. నేను గవర్నమెంట్ కాదు.. గవర్నమెంట్ సర్వెంటును మాత్రమే అని స్పష్టం చేసారు.

Also Read : Ap,Ts Medical Seats-రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినా సీట్లు పంచరా?

Show comments