Idream media
Idream media
“కేంద్రంతో పోరాడదామంటే నన్ను గెలిపించ లేదు. విశాఖలో గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు కోసం నిలబడేవాడిని. వైసీపీకి ఓట్లేసి నన్ను పనిచేయమనడం భావ్యమా?”
– అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు.. ప్రజల పక్షాన పోరాడడానికే వచ్చా.. అంటూ జనసేన పార్టీని స్థాపించిన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ప్రభుత్వంపై ఉన్న అక్కసును కార్మికులపై చూపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గెలిపిస్తేనే ప్రజల తరఫున పోరాడతారా? అదేనా నాయకుడి లక్షణం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సామాజిక న్యాయం, కుల రహిత సమాజం, అన్యాయం జరిగితే ప్రశ్నించడం కోసమే.. రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొనే పవన్ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది. ఆయన వ్యాఖ్యలు, చేష్టల్లో తేడా ఉంటోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఏపీ ప్రభుత్వాన్ని మేమే కోరాం..పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదు – తేల్చేసిన నిర్మాతలు..
విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రంగా నడుస్తోంది. ఆంధ్రుల హక్కు నినాదం మార్మోగుతూనే ఉంది. కర్మాగారం పరిరక్షణ కోసం కార్మికులు పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు చేసినా, కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో… ఢిల్లీలో కూడా నిరసన స్వరం వినిపించారు కార్మిక సంఘాల నాయకులు. వివిధ పార్టీల నేతలను కలుస్తూ, మద్దతు కూడగడుతున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రాణ త్యాగాలక్తెనా సిద్దమని హెచ్చరిస్తున్నారు. కార్మికులు ఇంత సీరియస్ గా ఉద్యమిస్తుంటే.. వారికి మద్దతుగా నిలవాల్సి పోయి.. గెలిపించ లేదు కాబట్టి నేనెందుకు పోరాడతాను అనే పవన్ వ్యాఖ్యానించడంపై కార్మిక సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. ప్లాంట్ ను విక్రయించవద్దంటూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం సైతం చేసి కేంద్రానికి పంపింది. రాష్ట్రంలోను, పార్లమెంట్ లోను వైసీపీ ఎంపీలు కేంద్ర తీరుపై నిరసన గళం విప్పుతున్నారు. కార్మికులకు అండగా నిలుస్తున్నారు. అలాంటిది విపక్షంలో ఉన్న పవన్ స్పందనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : మనిషి మారెను,భాష మారెను .. కులం మీద పవన్ యూ టర్న్