Idream media
Idream media
ఏపీ ఎన్నికల ఫలితాలలో అధికార పార్టీ వైసీపీ రికార్డు విజయాలను నమోదు చేస్తోంది. ఎన్నిక ఏదైనా విజయ దుందుభి మోగిస్తోంది. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్.. ఇలా ఎక్కడ చూసినా వైసీపీ అభ్యర్థులే గెలుస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా.. మరీ ఇంత ఘోర అపజయాలను మూటగట్టుకోవడం ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. తాజాగా మిగిలిన పరిషత్ లకు జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ కి షాక్ తగిలింది.
తాజా పరిషత్ ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ మెజార్టీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి కంచుకోట లాంటి స్థానాల్లో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. ఏపీలో వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల కోసం జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట, పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. పెనుగొండలో వైసీపీ అభ్యర్థి పొడూరి గోవర్థని 4401 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీడీపీకి కంచుకోట లాంటి పెనుగొండలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : కూలిన జేసీ సోదరుల చివరి కోట .. సొంత ఊరిలో ఓటమి ..
అయితే శ్రీకాకుళం జిల్లా హీర మండలంలోని జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టిడిపి అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు 59 ఓట్ల మెజార్టీతో గెలినట్లు ప్రకటించారు ఆర్వో. దీంతో రీ కౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు వైసీపీ అభ్యర్థి శ్రావణ్ రెడ్డి. అధికారులు రీ కౌంటింగ్ చేపట్టగా, టిడిపి అభ్యర్థి గెలుపు వార్త తెలిసి కౌంటింగ్ కేంద్రం దగ్గరకు పెద్ద ఎత్తునా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
అటు 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు కాస్త ప్రభావం చూపడం ఆ పార్టీకి కొంత ఊరట. శ్రీకాకుళం జిల్లాలోని హిర జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. ఇక్కడ టిడిపి అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు 59 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచినా కూడా ఈ స్థానంపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కడం గమనార్హం. వైసీపీ రీ కౌంటింగ్ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో తప్పేముందో ఆయనకే తెలియాలి.
Also Read : Hindupur, Chilamathur ZPTC – కూలుతున్న తెలుగుదేశం కోటలు.. ఈ రోజు బాలయ్య వంతు