Idream media
Idream media
తెలంగాణాలో ధాన్యం కొనుగోలు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన నేపధ్యంలో పోటా పోటీ నిరసనలు ఆసక్తిని రేపుతున్నాయి.సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం తర్వాత పరిస్థితి తెలంగాణాలో వేగంగా మారింది. ఇక కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు దిగాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ ఇవాళ మహాధర్నా నిర్వహిస్తుంది అధికార పార్టీ. ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ధర్నా నిర్వహిస్తుంది తెరాస.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఆసక్తిని రేపుతోంది. ధర్నా అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారని తెలుస్తోంది. యాసంగిలో ధాన్యం కొంటారో. లేదో… స్పష్టతివ్వాలంటూ సీఎం కేసీఆర్ పదే పదే మోదీ సర్కార్‌ను డిమాండ్ చేస్తున్న తరుణంలో ధాన్యం కొనాలని బీజేపీ కూడా నిరసనలకు దిగడం హాట్ టాపిక్ అయింది. ఈనెల 12న నియోజకవర్గాల కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు కూడా నిర్వహించింది.
ఇక తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ధర్నా నిర్వహించడం మూడో సారి. ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు నిరసనగా 2014లో రాష్ట్ర బంద్ చేపట్టింది అధికార పార్టీ. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 2019లో మహబూబ్‌నగర్ జిల్లా బూర్గుల వద్ద కేటీఆర్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా చేస్తున్నామని తెరాస పార్టీ అంటోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 500మంది నేతలు ధర్నాలో పాల్గొంటున్న నేపథ్యంలో.. పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెరాస పార్టీ ధర్నా చౌక్ ని మూసేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల ధర్నా చౌక్ ని ఓపెన్ చేయడం అక్కడ శుభ్రం చేయించడం హాట్ టాపిక్ అయింది. ధర్నాలో సీఎం కేసీఆర్ తో పాటుగా మంత్రులు హరీష్, కేటిఆర్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉంది అని ఆయన ఆరోపించారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినం అన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉదృతం చేస్తాం అని హెచ్చరించారు. పంజాబ్ లో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని స్వయంగా కోరినా, ప్రధానికి లేఖ రాసిన ఉలుకు లేదు పలుకు లేదు అని వ్యాఖ్యలు చేసారు. ఇది ఈ రోజుతో ఆగేది లేదు అని స్పష్టం చేసారు.
Also Read : Bandi Sanjay -బండి సంజయ్ మీద కోడిగుడ్ల దాడి