Shyam Singha Roy : గట్టి పోటీ మధ్య న్యాచురల్ స్టార్ సాహసం

ఇందాక నాని కొత్త సినిమా శ్యామ్ సింగ రాయ్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి చివర్లో ఉన్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో దీన్ని రూపొందించారు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు కావడంతో ఆ రకంగానూ క్రేజ్ ఎక్కువగా ఉంది. అయితే పుష్ప 17న వస్తున్న నేపథ్యంలో కేవలం వారం గ్యాప్ తో నాని నిర్మాతలు ఇంత రిస్క్ చేయడం పట్ల ఆశ్చర్యం కలగక మానదు. రెండూ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజవుతున్న సినిమాలే.

ఇరవై నాలుగో తేదీకి సరిగ్గా రెండు రోజుల ముందు మ్యాట్రిక్స్ కొత్త వెర్షన్ రిలీజ్ కాబోతోంది. దీని మీద కూడా భారీ క్రేజ్ నెలకొంది. శ్యామ్ సింగ రాయ్ వచ్చే రోజే 83 వస్తోంది. ఇండియన్ క్రికెట్ మొదటి వరల్డ్ కప్ విక్టరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ భారీ స్పోర్ట్స్ డ్రామాలో రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ గా నటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో దీన్ని ప్లాన్ చేయబోతున్నారు. నాగ చైతన్య థాంక్ యు కూడా ప్రాధమికంగా అదే డేట్ అనుకున్నారు కానీ ఇప్పుడీ ప్రకటనల దృష్ట్యా వాయిదా వేసే అవకాశం లేకపోలేదు. జనవరిలో బంగార్రాజు అనుకుంటున్నారు కాబట్టి థాంక్ యు దాని కంటే ముందు రావాల్సి ఉంటుంది.

మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ చేస్తోంది సాహసమే. ఒకరకంగా చెప్పాలంటే ఇంత కన్నా బెటర్ ఆప్షన్ లేకపోవచ్చు. నవంబర్ లో చేద్దామంటే టైం తక్కువగా ఉంది. దానికి తోడు ఆ నెలలో కూడా భారీ సినిమాలు షెడ్యూల్ చేసి ఉన్నాయి. పాన్ ఇండియా అంటే కేరళతో సహా అన్ని రాష్ట్రాల్లోనూ థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీ ఉంటేనే వర్కౌట్ అవుతాయి. సాయి పల్లవి ఉంది కాబట్టి మల్లువుడ్ లోనూ మంచి బిజినెస్ ఆశిస్తున్నారు నిర్మాతలు. ఇలా అన్ని కోణాల్లో చెక్ చేసుకునే డేట్ లాక్ చేసినట్టు కనిపిస్తోంది. జనవరిలో ఆర్ఆర్ఆర్ వచ్చేలోగా ఇలాంటి భారీ సినిమాలు వీలైనంత రన్ ని సాధించుకునే ప్లాన్ లో ఉన్నాయి

Also Read : Most Eligible Bachelor : అఖిల్ మొదటి హిట్టు గట్టిగానే పడింది

Show comments