Idream media
Idream media
కరోనా బారినపడిన రాజకీయనేతల జాబితాలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా చేరిపోయారు. కరోనా సోకిన విషయాన్ని నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. కోవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్‌గా తేలిందని ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. అయినా పూర్తిగా కోలుకునే వరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నానని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అప్రమత్తత ఎంతో అవసరం..
వారు, వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కోవిడ్ సోకుతోంది. మొదటి, రెండో వేవ్‌లో పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. థర్ట్ వేవ్ దేశంలో ప్రారంభమైంది. రోజుకు రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. థర్ట్ వేవ్‌లోనూ సామాన్యులతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నారు. సినీ నటుడు మహేష్‌బాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహా పలువురికి ఇటీవల కరోనా సోకింది. అన్ని జాగ్రత్తలు తీసుకునే వారికి కూడా కరోనా సోకడం.. అందరూ ఎంత అప్రమత్తతతో ఉండాలో తెలియజేస్తోంది.
Also Read : లోకేష్ జోక్యం,బాలాజీకి ఇబ్బందులు