Idream media
Idream media
కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోరం తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న రైతులపైకి ఓ కారు దూసుకెళ్లింది. రైతులు సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర సంచలనానికి దారి తీసింది. ఈ హింస కు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా నే కారణమని వార్తలు వెల్లువెత్తాయి. రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. తన కుమారుడికి ఏ పాపం ఎరుగడని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ పోలీసులు కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదు చేశారు. యూపీ సర్కార్ సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
లఖీంపూర్ ఖేరి కేసు లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా చుట్టు ఉచ్చు క్షణ క్షణానికి బిగుస్తోంది. పోలీసులు క్రైం స్పాట్ కు ఆశిశ్ ను తీసుకెళ్లి విచాణ జరిపారు . ఈ కేసులో ఆశిశ్ మిశ్రాతో పాటు సహ నిందితుడిగా ఉన్న అంకిత్ దాస్ పోలీసు విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. రైతులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని వాళ్ల మీదకు కాన్వాయ్ దూసుకెళ్లాలని ఆశిశ్ మిశ్రా డ్రైవర్ ను ఆదేశించాడని అంకిత్ దాస్ సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అకింత్ చెప్పిన ఈ వ్యాఖ్యలతో ఆశిశ్ మిశ్రా కష్టాలు రెట్టింపు అయినట్లే.
లఖీంపూర్ ఘటన జరిగినప్పుడు తాను అక్కడ లేనని వేరే ప్రాంతంలో ఉన్నట్టు వాదిస్తున్నాడు ఆశిశ్ మిశ్రా. కాని అంకింత్ దాస్ విచారణతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆందోళన చేస్తున్న రైతులపై అంకిత్ దాస్ కాల్పులు జరిపినట్టు కూడా అభియోగాలు నమోదయ్యాయి. అయితే రైతులను ఢీకొట్టిన తరువాత జీపు బోల్తా పడిందని. డ్రైవర్ ను బయటకు లాగి చంపేశారని అంకిత్ దాస్ తెలిపాడు. ప్రాణరక్షణ కోసమే తాను కాల్పులు జరిపినట్టు అంకిత్ దాస్ తెలిపాడు. ఈనెల 3న లఖీంపూర్ లో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక జర్నలిస్టుతో పాటు 9 మంది మృతి చెందారు. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్నికోరింది. అయితే.. యూపీ సర్కార్ ఇచ్చిన నివేదికపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది.
Also Read : Maoist RK Died : ఆర్కే నిజంగా చనిపోయాడా, ఎవరు దృవీకరించాలి?