Municipal Elections Result, Kuppam – మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు.. బాబు కోట బద్ధలు కాబోతోందా..?

తెలుగు రాష్ట్రాలలో మరో ఆసక్తికరమైన ఎన్నికల ఫలితం ఈ రోజు వెలువడబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 సాధారణ ఎన్నికల తర్వాత.. పలు ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయినా సాధారణ ఎన్నికల తర్వాత.. ఈ స్థాయిలో ఫలితంపై ఆసక్తి నెలకొనడం ఇదే తొలిసారి. తెలంగాణలో హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై తెలుగు రాష్ట్రాలు ఎంత ఉత్కంఠగా ఎదురుచూశాయో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ఫలితంపై కూడా అంతకు మించిన ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు దశాబ్ధాలకు పైగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనిదే ఈ మున్సిపాలిటీ కావడంతోనే ఈ ఆసక్తి నెలకొంది.

తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పం కోటపై జెండా ఎగురవేయాలని వైసీపీ, పంచాయతీ, పరిషత్‌లలో ఎదురైన పరాభవం పునరావృతం కాకుండా ఉండాలనే పట్టుదలతో టీడీపీలు.. ఈ ఎన్నికల్లో పోరాడాయి. ప్రచారం నుంచి పోలింగ్‌ వరకు రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు వ్యవహరించాయి. మొత్తం 25 వార్డులకు గాను ఒక వార్డు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా.. మిగతా 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 76.84 శాతం పోలింగ్‌ నమోదైంది. భారీగా నమోదైన పోలింగ్‌ తమకు అనుకూలమని వైసీపీ అంచనా వేస్తోంది. విజయంపై వైసీపీ ధీమాగా ఉండగా.. దొంగ ఓట్లు వేశారంటూ చంద్రబాబు మాట్లాడడంతో.. ఓటమిని ముందుగానే అంగీకరించారనే అభిప్రాయాలు నెలకొన్నాయి.

Also Read : Fack Votes, Chandrababu Naidu, Kuppam – ఆడలేక మద్దెల వోడు..ప్రతి ఎన్నికల్లోనూ బాబు ఎత్తుగడ

కుప్పంతోపాటు నెల్లూరు కార్పొరేషన్‌ సహా మరో 11 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఫలితాలు కూడా ఈ రోజు వెల్లడికాబోతున్నాయి. నెల్లూరులో 54 వార్డులకు గాను వైసీపీ 8 డివిజన్లను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగతా 46 డివిజన్లలో 52.25 శాతం పోలింగ్‌ నమోదైంది. బుచ్చిరెడ్డిపాలెంలో మొత్తం 20 వార్డులలో 61.06 శాతం, ఆకివీడులో మొత్తం 20 వార్డులలో 78.45 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ టీడీపీ, బీజేపీ,జనసేన, సీపీఎంలు కూటమిగా ఏర్పడి వైసీపీపై పోటీ చేశాయి. జగ్గయ్యపేటలోని 31 డివిజన్లలో 78.45 శాతం, కొండపల్లిలో 66.79 శాతం చొప్పన పోలింగ్‌ నమోదైంది.

Also Read : Akividu Muncipal Election – ఆకివీడులో మహాకూటమి గెలిచేనా?

గుంటూరు జిల్లా పల్నాడులోని గురజాలలో 20 వార్డులకు గాను 6 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 14 వార్డులలో 71.18 శాతం పోలింగ్‌ నమోదైంది. దాచేపల్లిలో ఒక వార్డును వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా, మిగతా 19 వార్డుల్లో 71.88 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రకాశం జిల్లా దర్శిలో 20 వార్డులకు గాను ఒక వార్డు వైసీపీకి ఏకగ్రీవం కాగా.. మిగతా 19 వార్డుల్లో 75.25 శాతం, కర్నూలు జిల్లా బేతంచర్లలోని మొత్తం 20 వార్డుల్లో 71.25 శాతం, వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేటలో 29 వార్డుల్లో 67.27 శాతం, కమలాపురంలో 20 వార్డుల్లో 76.16 శాతం, అనంతపురం జిల్లా పెనుకొండలోని మొత్తం 20 వార్డుల్లో 82.63 శాతం చొప్పన పోలింగ్‌ నమోదైంది.

Also Read : Kuppam-Chandrababu-చంద్రబాబులో ఉన్నది బాధా? భయమా…? ఏం మాట్లాడుతున్నారు సార్…?

తమ్ముళ్లని నమ్మకుండా విజయవంతమైన బాబు..

ఈ ఎన్నికల్లో ప్రతి చోటా ఉన్న స్థానాలకు మూడు, నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా టీడీపీ నామినేషన్లు దాఖలు చేయించింది. ప్రతి డివిజన్‌/వార్డులో వేర్వేరు అభ్యర్థులు ముగ్గురు లేదా నలుగురు చేత నామినేషన్‌ వేయించిన చంద్రబాబు.. దాదాపు ప్రతి చోటా టీడీపీ పోటీలో ఉండేలా విజయవంతమయ్యారు. ఒకరు చేతనే నామినేషన్‌ వేయిస్తే.. ప్రలోభాలకు లొంగిపోతున్నారని, ఫలితంగా వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంటోందని ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో గమనించిన చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో తమ్ముళ్లను నమ్మలేదు. అందుకే పలువురు చేత ఒకే చోట నామినేషన్‌ వేయించి విజయవంతమయ్యారు. పోలింగ్‌ రోజున కూడా శక్తి మేరకు టీడీపీ పోరాడింది. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.. మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Also Read : Special Observer, Kuppam Counting – కుప్పం ఓట్ల లెక్కింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Show comments