GJ Reddy Son Filed Complaint On Ramoji Rao: షేర్ల కోసం తుపాకీతో రామోజీ బెదిరింపు.. AP సీఐడీకి ఫిర్యాదు

షేర్ల కోసం తుపాకీతో రామోజీ బెదిరింపు.. AP సీఐడీకి ఫిర్యాదు

మార్గదర్శి చిట్‌ఫండ్‌ చైర్మన్‌ రామోజీరావుకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆయన మీద ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. రామోజీరావు చేసిన మరో ఘరనా మోసం వెలుగు చూడటంతో.. ఆయనపై కేసు నమోదయ్యింది. ఇంతకు రామోజీ రావు మీద ఫిర్యాదు చేసింది ఎవరంటే.. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి. మార్గదర్శిలో తమకు రావాల్సిన వాటాల కోసం వెళ్తే.. రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా ఆయన పేరిట రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు యూరిరెడ్డి. తన తండ్రి జీ జగన్నాథరెడ్డి పేరు మీద ఉన్న వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని చెప్పుకొచ్చాడు యూరి రెడ్డి. గతంలో ఈ షేర్ల విషమై తాను స్వయంగా కలిసి అడిగితే.. రామోజీరావు తనను తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. గత కొంత కాలంగా.. మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాల పుట్ట కదిలిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మధ్యే తమ షేర్‌హోల్డింగ్‌పై స్పష్టత రావడంతోనే.. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి పేర్కొన్నారు.

యూరి రెడ్డి ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు రామోజీరావు, శైలజాకిరణ్‌ల మీద కేసు నమోదు చేయగానే.. ఆయన వెంటనే స్పందించారు. ఫిర్యాదు చేయంగానే.. ఆఘమేఘాల మీద ఆయన లీగల్ టీం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ నమోదు చేశారు. యూరి రెడ్డి ఫిర్యాదును సవాల్‌ చేస్తూ ఇలా క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కేసు నమోదైన కొన్ని గంటల్లోనే క్వాష్ పిటిషన్ వేయడం సామాన్యులెవరికీ సాధ్యం కాని విషయం. ఇక ఈ కేసు నేడు అనగా మంగళవారం హైకోర్టు ముందు విచారణకు రానుంది.

Show comments