సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది- మంచు విష్ణు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలకు సంబంధించి తీసుకునే నిర్ణయంపై అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా అందరికి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే సినిమా టికెట్ ధరల విషయంలో కొందరు సినీ పెద్దలు చేస్తున్న హడావుడితో కాస్త ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించి కూడా ఆసక్తికర వాతావరణం నెలకొంది.

అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సిఎం జగన్ ను కలవడంతో సమస్య దాదాపుగా పరిష్కారం అయిందనే విషయం స్పష్టం అవుతోంది. సినిమా పెద్దలు కూడా త్వరలో జగన్ ను కలిసే అవకాశం ఉందనే మాట వినపడుతోంది. నిర్మాతల మండలి కూడా దీనిపై ఏపీ ప్రభుత్వాన్ని కలిసే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంచితే… ఇప్పుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు తిరుపతి లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి, సినిమా పరిశ్రమ గురించి టికెట్ ధరలకు సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు.

తిరుపతి లో మన్యం రాజు సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న మంచు విష్ణు… తిరుపతి లో మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిల్మ్ కోర్సు పెట్టనున్నాము అని తెలిపారు. దాని ద్వారా నూతన నటి నటులు ,టెక్నిషియన్స్ ని ప్రోత్సహిస్తామని మంచు విష్ణు పేర్కొన్నారు. తిరుపతిలో మోహన్ బాబు స్టూడియో ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆయన. సినిమా టికెట్లు ధరను తెలంగాణలో పెంచారు, ఇక్కడ తగ్గించారుఅని రెండు చోట్లా దానిపై కోర్టుకు పోయారన్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అని ఆయన ప్రశ్నించారు.

టికెట్స్ విషయం ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం కు కట్టుబడతామన్నారు మంచు విష్ణు. వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్పట్లెదు అని చెప్తే అది ‘మా’ అభిప్రాయం అవుతుందన్నారు. ఎవరో ఒకరు వెళ్లి ప్రభుత్వం తో మాట్లాడటం వ్యక్తిగతం అవుతుందన్నారు. సమిష్టిగా అందరి మేలుకోసం అడుగులు పడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు చిరంజీవితో సినీ పరిశ్రమ పెద్దలు సమావేశం కావటం శుభపరిణామం అన్నారు. దాసరి నారాయణరావు ఉన్నపుడు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవోను ఒక నలుగురి కోసం మార్చారు దానిపై చర్చ జరగాలన్నారు.

Show comments