సిఎంను కలిసిన మంచు విష్ణు

ఏపీ సిఎం వైఎస్ జగన్ తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కాసేపటి క్రితం భేటీ అయ్యారు. సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఆసక్తికర చర్చ జరగడం, ఇటీవల సినిమా పెద్దలు సిఎం తో భేటీ కావడం… వంటి అంశాల నడుమ ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కమిటీ ఇచ్చిన నివేదిక సినిమా పెద్దల భేటీలో చర్చకు వచ్చింది. అటు జగన్ కూడా సినిమా సమస్యల మీద సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో సమస్య దాదాపుగా పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.

ఇక సిఎం జగన్… చిరంజీవి బృందంతో భేటీ తరువాత మోహన్‌ బాబు నివాసానికి వెళ్లిన మంత్రి పేర్ని నాని… టికెట్ ల ధర గురించి మాట్లాడారు. సిఎంతో భేటీకి సంబంధించి తనకు ఆహ్వానం అందలేదని మంత్రి పేర్ని నానికి చెప్పిన మోహన్‌ బాబు, మంచు విష్ణు… ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సిఎం దృష్టికి ఈ సమాచారం వెళ్లడంతో మంచు విష్ణుని నేడు ప్రత్యేకంగా విందుకు సిఎం జగన్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ వీరి మధ్య సమావేశం జరుగుతుంది.

సినీ పరిశ్రమకు సంబంధించి టిక్కెట్ల వ్యవహారం , ప్రభుత్వం ఇచ్చే రాయితీలు సహా పలు ఇతర అంశాల పైన వీరి మధ్య చర్చ జరుగుతుంది. చిరంజీవి బృందంతో జరిగిన సమావేశ వివరాలను కూడా మంచు విష్ణుకు సిఎం జగన్ చెప్పే అవకాశం ఉంది. దీనితో టికెట్ ల సమస్య దాదాపుగా పరిష్కారం దిశగా వెళ్తుంది. ఇటీవల మంచు విష్ణు కూడా… సిఎం జగన్ తీసుకునే నిర్ణయం పట్ల సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక జగన్… మంచు విష్ణు భేటీ సమయంలో సిఎం జగన్ తో సినీ నటుడు అలీ కూడా భేటీ అయ్యారు. కాసేపటి క్రితం అలీ తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు.

Also Read : చిరంజీవి సంస్కారం చూపితే బాబుకి వచ్చిన నష్టమేమిటట?

Show comments