రాజకీయాలకు కేశినేని గుడ్ బై .. వారసురాలి రంగ ప్రవేశం?

విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద కేశినేని నాని చెప్పినట్లుగా తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు ఎదుర్కొన్న కేసినేని నాని కుటుంబం ఇక ఎన్నికలకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కొంతమంది నాయకులు నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం అంతేకాకుండా పార్టీ అధిష్టానం నుంచి ఊహించని ఇబ్బందులు ఎదురు కావడంతో కేసినేని నాని రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

2014 ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని పార్టీ నాయకులతో సఖ్యతగా మెలగడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీలో ముందునుంచి ఉన్న వాళ్లకు కేసినేని నాని గుర్తింపు ఇవ్వడం లేదని తన పార్లమెంట్ పరిధిలో ఉన్న కొంతమంది నాయకులతో ఆయన దూరం పాటించారని చంద్రబాబు నాయుడుతో వద్ద ఉన్న గుర్తింపుతో కేసినేని నాని పార్టీ నాయకులను దూరం పెట్టారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కేశినేని నాని పార్టీ నుంచి సహకారం లేకపోవడం తో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తమ పార్టీ అధినేత చెప్పినట్టుగా టీడీపీ అనుకూల మీడియా లో వార్తలు వస్తున్నాయి.

Also Read : ఇప్పుడేమంటారు బాబూ.. సర్కారీ మటన్ దుకాణాలు మీకు నచ్చినట్టేనా

కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నాని ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు అని ప్రచారం కూడా ఉంది. తన కుమార్తె కేశినేని శ్వేత టాటా ట్రస్ట్ కు వెళ్లిపోయారని అలాగే తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విజయవాడ పార్లమెంటుకు నెరవేర్చా అని తనకు పార్టీలో ఉండే పరిస్థితులు గానీ అలాగే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు సానుకూలంగా కనబడటం లేదని కేశినేని నాని పార్టీ అధినేతకు చెప్పినట్టుగా తెలుస్తుంది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న బోండా ఉమ అలాగే మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమ సహా పలువురు నాయకులతో ఆయనకు విభేదాలున్నాయి. విజయవాడ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ విషయంలో కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక తన కుమార్తె విజయానికి పార్టీ నాయకులు ఎవరు కష్టపడక పోవడం అలాగే ఎన్నికలకు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేయడం వంటివి కేశినేని నానికి ఏమాత్రం రుచించలేదు.

Also Read : అలా చేస్తే ఇరకాటంలో ప‌డేది టీడీపీనే..!

ఆ తర్వాత పార్టీ అధిష్టానం తనను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయడం గానీ అలాగే తనపై విమర్శలు చేస్తున్న నాయకులను కంట్రోల్ చేసే ప్రయత్నం గానీ చేయకపోవడం కేశినేని నానికి మింగుడు పడలేదు. దీనితో ఇక ఎన్నికలకు పోటీ చేయకుండా ఉండటమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చారని పార్టీలో మాత్రం కొనసాగుతానని చెప్పారట. అయితే ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలకు కూడా కేసినేని నాని దూరంగానే ఉన్నారని సమాచారం.

ఇతర ఎంపీలతో కూడా ఆయన పెద్దగా మాట్లాడటం లేదని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు విజయవాడ లోనే ఉంటున్న ఆయన వద్దకు వెళ్లడానికి కేసినేని నాని ఇష్టపడటం లేదని టిడిపి వర్గాలు అంటున్నాయి. తనకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన లో ఉన్న నాని వచ్చే ఎన్నికలకు వేరే అభ్యర్థిని చూసుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. 2019 ఎన్నికలకు ముందు కూడా కేసినేని నాని తాను పోటీ చేసేది లేదని ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆయన పోటీ చేసి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తాను పోటీ చేయనని మరో అభ్యర్థిని చూసుకోవాలని పార్టీ అధినేతకు చెప్పినట్టుగా తెలుస్తుంది.

Also Read : జేసీ దివాకర్‌ రెడ్డి లేటెస్ట్‌.. ఇక అక్కడ నుంచి రాజకీయం

Show comments