నెరవేరిన 41ఏళ్ల కల… ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ కొట్టిన హాకీ మెన్స్ టీం…

ఒలింపిక్స్ లో భారత్ జోరు కొనసాగుతుంది. గోల్డ్ మెడల్ ఛాన్స్ మిస్ అయినా కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచులో మెన్స్ హాకీ టీం ఆదరగొట్టింది. 41ఏళ్ల తరువాత ఒలింపిక్స్ లో మెడల్ కొట్టింది. కాంస్యం కోసం జరిగిన మ్యాచులో కసితో ఆడిన టీం ఇండియా జర్మనీపై 5-4గోల్స్ తేడాతో అద్భుతమైన విక్టరీ సాధించింది. టీం ఇండియా ఆటగాళ్ల సమిష్టి కృషితో కల సాకారం చేసుకుంది. ఆట ప్రారంభమైన మొదటి నిమిషానికే గోల్ కొట్టి లీడ్ లోకి దూసుకెళ్లింది జర్మనీ. తొలి క్వార్టర్ లో ఇండియా నుంచి ఎలాంటి గోల్ నమోదు కాలేదు. రెండో క్వార్టర్ 17వ నిమిషంలో సిమ్రన్ జిత్ గోల్ కొట్టడంతో ఇండియా ఖాతా తెరిచింది. తర్వాత 24వ నిమిషంలో రెండో గోల్ తో జర్మనీ లీడ్ లోకి దూసుకెళ్లింది. 25వ నిమిషంలో జర్మనీ మరో గోల్ నమోదు చేయడంతో రెండు జట్ల మధ్య గోల్స్ తేడా 3-1కి పెరిగింది. ఐతే తర్వాత దూకుడు పెంచిన ఇండియన్ ప్లేయర్స్…28, 29 నిమిషాల్లో వరుస గోల్స్ కొట్టారు. 28వ నిమిషంలో హార్దిక్ సింగ్, 29వ నిమిషంలో హర్మన్ ప్రీత్ వరుసగా గోల్స్ కొట్టారు. దీంతో సగం ఆట ముగిసే సమయానికి రెండు జట్లు చెరో మూడు గోల్స్. తో సమంగా ఉన్నాయి.

ఇక థర్డ్ క్వార్టర్ లోనూ అదే అటాకింగ్ కొనసాగించారు భారత ప్లేయర్లు జర్మనిపై పూర్తి ఆధిపత్యం కొనసాగించారు. 31వ నిమిషంలో రూపిందర్ పాల్ గోల్ కొట్టడంతో ఇండియా లీడ్ లోకి వెళ్లింది. ఇక మ్యాచ్ 34వ నిమిషంలో సిమ్రాన్ జిత్ తన రెండో గోల్ నమోదు చేయడంతో రెండు జట్ల మధ్య గోల్స్ తేడా 3-5 కు పెరిగింది. 43 నిమిషంలో జర్మనీకి మూడు పెనాల్టీ కార్నర్ లు దక్కగా.. అద్భుతమైన డిఫెన్స్ తో మూడు పెనాల్టీ కార్నర్లను సేవ్ చేశారు ఇండియన్ ప్లేయర్లు. మూడో క్వార్టర్ లో ఇండియా రెండు గోల్స్ కొట్టగా.. జర్మనీ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది.

ఇక మూడో క్వార్టర్ లో ఒక్క గోల్ కూడా కొట్టని జర్మనీ… నాలుగో క్వార్టర్ 48వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ సాయంతో నాలుగో గోల్ కొట్టింది. దీంతో ఇండియా లీడ్ ను 4-5 తేడాకు తగ్గించింది. తర్వాత జర్మనీని మరో గోల్ కొట్టకుండా అడ్డుకోవడంతో ఇండియాకు కాంస్యం ఖరారైంది.

ఒలింపిక్స్ లో పతకం సాదించడంతో హాకీ జట్టు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. వారితో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఒలింపిక్స్ లో పతకం సాధించిన హాకీ మెన్స్ టీం పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది భారత్ ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు.

ఒలింపిక్స్ లో భారత్ 8 గోల్డ్,1 సిల్వర్,3 బ్రాంజ్ మెడల్స్ సాధించిన రికార్డ్ ఉంది. చివరిగా 1980లో గోల్డ్ మెడల్ కొట్టిన భారత్ 2021 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బ్రాంజ్ మెడల్ కొట్టింది.

మహిళ హాకీ టీంకు అవకాశాలు..

టోక్యో ఒలింపిక్స్ లో మహిళ హాకీ టీం కూడా సంచనాలు సృష్టిస్తోంది. సెమీఫైనల్ లో వరల్డ్ నెంబర్ 2 అర్జెంటీనా చేతిలో 2-1 తేడాతో భారత్ ఓటమిపాలైంది. తృటిలో ఫైనల్ ఛాన్స్ మిస్ అయింది. అయిన శుక్రవారం జరిగే బ్రాంజ్ మెడల్ పోటీలో గ్రేట్ బ్రిటన్ తో తలపడనుంది. అంచనాలు మించి రాణిస్తున్న మహిళ హాకీ టీం బ్రాంజ్ మెడల్ కోసం జరిగే మ్యాచులో సర్వశక్తులు ఒడ్డి మెడల్ సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయలని యావత్ భారత్ ఉవ్విళ్లూరుతోంది.

Show comments