Idream media
Idream media
హుజురాబాద్ లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు. 23 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ తో ఈటెల రాజేందర్ హుజురాబాద్ లో వరుసగా ఏడోసారి విజయకేతనం ఎగురవేశారు. ఐదు నెలల నుంచి హుజురాబాద్ ఎన్నికల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ కూడా ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాలు ప్రకటించడం అదే విధంగా ఎన్నో వ్యూహాలు అమలు చేయడం అలాగే ఇతర పార్టీల నుంచి కొంత మంది నాయకులను పార్టీలోకి తీసుకోవడం వంటి చర్యలకు దిగారు.
అయినా సరే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర గెలుపుని సీఎం కేసీఆర్ అడ్డుకోలేక పోయారు. హుజురాబాద్ ఎన్నికల విషయంలో ఈటెల రాజేందర్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా తనతో నమ్మకంగా ఉండే వాళ్లను కూడా చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించారు. అధికార పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మంత్రులు తనపై విమర్శలు చేసినా సరే నమ్ముకున్న వాళ్ళు తనని వదిలేసి వెళ్ళిపోతున్నా సరే ఈటెల రాజేందర్ మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు.
అయితే ఈటెల రాజేందర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గాని లేకపోతే ఎన్నికల ప్రచారంలో గాని తాను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను అనే విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించే ప్రయత్నం చేయలేదు.బిజెపి నాయకులు హుజరాబాద్ లో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా పార్టీ పేరును చాలా తక్కువగా ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తాను హుజురాబాద్ విషయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా ప్రస్తావిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. మంత్రి హరీష్ రావు ప్రచారం చేసినా ఇతర మంత్రులు ప్రచారం చేసినా సరే తాను హుజురాబాద్ కు ఏం చేశానో ప్రజలకు అది చెప్పడంతో ప్రచారంలో ముందుకెళ్లారు.
Also Read : Padi Kaushik Reddy – పాపం కౌశిక్ రెడ్డి.. గెల్లు సేఫ్, ఈటెల సేఫ్.. అటూ ఇటూ కాకుండా అయ్యాడే?
ఇక గెలిచిన తర్వాత కూడా ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ పేరును ఎక్కువగా ప్రస్తావించలేదు. బిజెపి నాయకులకు ధన్యవాదాలు చెప్పడమే గానీ భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని ఎక్కువగా ప్రస్తావించే ప్రయత్నం చేయడం గాని లేకపోతే బిజెపి నాయకులు ఎక్కువగా కృషి చేశారు అని చెప్పడం గానీ ఎక్కువగా చేయలేదు. తనను సీఎం కేసీఆర్ అవమానించారని కానీ హుజురాబాద్ ప్రజల గుండెల్లో పెట్టుకున్నారని ఎంత సేపు తన సొంత ఇమేజ్ గురించి ఆయన మాట్లాడారు.
దీనితో హుజురాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ కృషి కంటే కూడా ఈటెల రాజేందర్ సొంత ఇమేజ్ గెలిపించింది అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. అంతేకాకుండా హుజురాబాద్ కు సంబంధించి ఈటల రాజేందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే ఎక్కువ మెజారిటీ వచ్చి ఉండేదని భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడం తో మెజారిటీ తగ్గిందని కొంత మంది అభిప్రాయపడ్డారు. ఇక హుజురాబాద్ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం పెద్దగా దృష్టి పెట్టక పోయినా సరే ఈటెల రాజేందర్ పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు.
ప్రచారం విషయంలో కూడా ఎవరైనా రాకపోయినా సరే ఈటల రాజేందర్ మాత్రం వెనక్కు తగ్గకుండా ప్రచారం చేసుకున్నారు. బండి సంజయ్ అలాగే ధర్మపురి అరవింద్ సహా కొంతమంది బిజెపి నాయకులు ప్రచారం చేసినా సరే ఈటెల రాజేందర్ మాత్రం వాళ్ల ప్రచారం మీద ఎక్కువగా ఆధారపడ లేదు. దీంతో ఈ గెలుపు విషయంలో భారతీయ జనతా పార్టీ కృషి కంటే కూడా ఈటెల రాజేందర్ సొంత ఇమేజ్ ఎక్కువగా సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా క్యాడర్ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ గెలుపు ఈటెల రాజేందర్ వ్యక్తిగతమని భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
Also Read : Huzurabad By Poll-ఈటెల భవిష్యత్‌కు కేసీఆర్ బంగారు బాట..ఇక ఎవరొచ్చినా ఏం చేయలేరుగా?