High Court House sites -ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి ప‌నిలోనూ వేలు పెట్ట‌డం స‌రైందేనా?

ప్ర‌జ‌ల కోసం చేసినా ప్ర‌భుత్వ తీరు కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. ప్ర‌భుత్వానికి పేరు వ‌స్తుంద‌నో, ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌నో, ఏదో ర‌కంగా ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌నో కార‌ణాలు ఏమైనా కొంద‌రు తీరు ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌నేది వాస్త‌వం. దీన్ని గుర్తించిన న్యాయ‌స్థానం కూడా కొన్ని అంశాల‌కు సంబంధించి కీల‌కమైన వ్యాఖ్య‌లు చేసింది. ఇది రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో ఒకింత ఆనందం పెంచుతోంది. కొన్ని చిక్కుల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం స‌ర్కారుకు త‌ల‌కు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొందరు నాయకులు కూడా న్యాయవ్యవస్థపై ఆసక్తికర కామెంట్లు చేసి.. వివాదాల్లో చిక్కుకున్నారు. అంతేకాదు.. కోర్టు తీర్పుల ప్రభావంతో అధికారులు కూడా తమపై ఎలాంటి కేసులు పెడతారో.. కోర్టుకు ఎప్పుడు వెళ్లాల్సి వస్తుందో.. అనివారు కూడా హడలి పోతున్నారు.

ప్రజా క్షేత్రంలో భారీ విజయం దక్కించుకున్నా. .

న్యాయపరంగా లభిస్తున్న విమర్శల కారణంగా.. ప్రభు త్వం కొన్ని అంశాల్లో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇక కోర్టు తీర్పులు.. ఆదేశాలను ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. దీంతో సర్కారుకు కొన్ని తలనొప్పులు వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు సర్కారు తీసుకున్న చర్యలను సమర్ధిస్తూ.. హైకోర్టులో వరుస విజయాలు ప్రభుత్వం సొంతం చేసుకుంటుండడం పార్టీలోను ప్రభుత్వ వర్గాల్లోనూ సంతోషాన్ని నింపుతోంది. ఉదాహరణకు .. నవరత్నాలు.. పథకం కింద జగనన్న ఇళ్ల పథకానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో రాష్ట్రంలోని 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ విషయంలో కొందరు కోర్టుకు వెళ్లారు.

మొత్తం వంద శాతం మహిళలకే పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అదే సమయంలో ఇళ్లను కూడా గుంటల్లో కేటాయించారని ఆరోపించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. ఇంటి మహిళలకు పట్టాలు ఇస్తే.. కుటుంబం మొత్తానికి ఇచ్చినట్టే కదా! అని ప్రశ్నించింది. అంతేకాదు.. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ వేలు పెట్టడం సరికాదని హితవు పలికింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు జగన్ తన పేరు పెట్టుకున్నారని ఇది సరికాదని ఆరోపిస్తూ .. కొందరు కోర్టుకు వెళ్లారు. దీనిపైనా విచారణ చేసిన.. హైకోర్టు.. దీనిలో తప్పేముందని ప్రశ్నించింది. మొత్తానికి ఈ రెండు పరిణామాలు కూడా వైసీపీలో జోరును పెంచాయి.

Also Read ;  AP High Court, Rayapati Sailaja – ప్రతి నిర్ణయంపై కోర్టుకెక్కడమేంటి.? అమరావతి జేఏసీ నేత రాయపాటి శైలజకు హైకోర్టు మందలింపు

Show comments