Helicopter Accident, CDS Bipin Rawat – హెలికాప్టర్‌ ప్రమాదం : ముందే దూకేసిన బిపిన్‌.. మిగతా వారందరూ దుర్మరణం

ఊటిలోని కానూరు ఫారెస్ట్‌లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ ప్రాణాలతోనే ఉన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయన్ను గుర్తించిన సహాయక సిబ్బంది ఘటనా స్థలం నుంచి డోలీలో రోడ్డు మీదకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి వాహనంలో ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. డోలీలో బిపిన్‌ రావత్‌ కొన ఊపిరితో కదులుతున్నారు.

మొత్తం 14 మందిలో బిపిన్‌ తప్పా మిగతా 13 మంది చనిపోయారు. ఒక్కొక్కటిగా మృతదేహాలను వెలికి తీసిన సిబ్బంది.. ఆస్పత్రికి తరలించారు. మంటల్లో వారందరూ కాలిపోవడంతో.. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా వారిని గుర్తించనున్నారు. చివరగా బిపిన్‌ రావత్‌ సతీమణి మధుళిక రావత్‌ మృత దేహాన్ని సహాయక సిబ్బంది ప్రమాద స్థలంలో గుర్తించారు.

హెలికాప్టర్‌లో మంటలు చేలరేగడం వల్ల ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం. మంటలు చెలరేగడంతో హెలికాప్టర్‌ కుప్పకూలింది. అంతకు ముందే బిపిన్‌ హెలికాప్టర్‌ నుంచి దూకేశారు. ఆయనకు కాలిన గాయాలు ఉన్నాయి. దూకడం వల్ల రక్తగాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య చికిత్సను అందిస్తున్నారు.

మరోవైపు ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై ఎయిర్‌ ఫోర్స్‌ అధికారుల బృందం విచారణ చేస్తోంది. 15 మందితో కూడిన అధికారుల బృందం ఘటనా స్థలిని పరిశీలిస్తోంది. పైలెట్, కో పైలెట్‌ మాటలు రికార్డు చేసే బ్లాక్‌ బాక్స్‌ను అధికారులు వెతుకుతున్నారు. బ్లాక్‌ బాక్స్‌ దొరికితే.. ఈ ప్రమాదంపై అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ప్రమాదంపై కేంద్ర కేబినెట్‌ అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించింది. త్రివిధ దళాల అధిపతికి ప్రమాదం జరగడంతో.. భద్రతా పరమైన అంశాలపై ప్రధాని సమీక్షించారు. సాయంత్రం ప్రధాని మోదీ త్రివిధ దళాల చీఫ్‌లు, ఇతర అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ప్రమాదంపై ఈ రోజు పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రకటన చేస్తారని వార్తలు వెలువడగా.. అది రేపటికి వాయిదా పడింది. బిపిన్‌ రావత్‌ ఇంటికి వెళ్లిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటనా స్థలానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ బయలుదేరారు.

Also Read : Army Helicopter, Kannur, Bipin Rawat – కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. అందులో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌

Show comments