బీజేపీ ఎమ్మెల్యే కు ఈసీ 24 గంట‌ల డెడ్‌లైన్..!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో… ఆ రాష్ట్ర ఓటర్లను ఉద్దేశిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.. హిందువులందరూ ఏకం కావాలి.. హిందువులంతా యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయాల్సిందేనని పిలుపునిచ్చిన ఆయన.. ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్‌కు ఓటు వేయనివారంతా ద్రోహులు అని.. వారికి ఉత్తరప్రదేశ్‌లో స్థానం లేదని పేర్కొన్నారు.. ఇక, యోగికి ఓటువేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్‌ ఇచ్చిన ఆయన.. యోగికి ఓట్లు వేయనివారిని గుర్తిస్తామని.. ఇప్పటికే వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని, వాటిని తెప్పిస్తున్నారని.. బుల్‌డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో.. తెలుసా? యోగికి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఇంటికి వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలు పంపిస్తామని హెచ్చరించారు.. అయితే, రాజా సింగ్‌ వ్యాఖ్యలపై సీరియస్‌ అయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం..

యూపీలోని ఓటర్లను తమ పార్టీకి ఓటు వేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడినందుకు తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్‌కు ఈసీ నోటీసులు పంపింది.. ఐపీసీ, ఆర్‌పీ చట్టం మరియు ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది… దీని కోసం ఎమ్మెల్యే రాజా సింగ్‌కు 24 గంటల సమయం ఇచ్చింది ఎన్నికల కమిషన్‌.. కాగా, ఉత్తరప్రదేశ్‌లో రెండోదశతో పాటు గోవా, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ సోమవారం ముగిసింది. ఫిబ్రవరి 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌‌లో మిగిలిన దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Show comments