కోటి రూపాయలు రేవంత్ కట్టేనా…? రేవంత్ నోరు జారారా…?

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి ఏ మలుపు తిరుగుతుందో అని ప్రజలు అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఇది రాజకీయ మలుపు తిరగడం సంచలనం అయింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరి పేర్లు ఉన్నాయి ఏంటీ అనేది బయటకు పూర్తిగా రాకముందు… మంత్రి కేటిఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య ట్విట్టర్ యుద్ధం, ఆ తర్వాత పరువు నష్టం దావా అంటూ కోర్ట్ కి వెళ్ళడం గంటల వ్యవధిలో జరిగిపోయాయి. మంత్రి కేటిఆర్ వైట్ చాలెంజ్ కి రావాలి అంటూ రేవంత్ ఇచ్చిన పిలుపు ఒక ఊపు ఊపింది.

ఆ తర్వాత తాను వస్తానని, ఎయిమ్స్ కి రాహుల్ గాంధీ ని కూడా తీసుకొస్తే అక్కడ ఇద్దరం టెస్ట్ చేయించుకుంటాం అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ చేసారు మంత్రి. ఇక తనపై చేసిన ఆరోపణలకు గానూ రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసారు మంత్రి. దీనిపై నేడు కోర్ట్ లో వాదనలు జరిగాయి. తమ పరువు ను భంగం కలిగేలా రేవంత్ రెడ్డి నాపై ఆరోపణలు చేస్తున్నారు అని మంత్రి కోర్ట్ దృష్టికి తీసుకెళ్ళారు. నాకు డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేకుండా ఉద్దేశ పూర్వకంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

నేను ఎమ్మెల్యే గా మంత్రి గా నేను పదవుల్లో ఉన్నాను అని కోర్ట్ కు వివరించిన మంత్రి… కోటి రూపాయలు పరువు నష్టం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వండి అంటూ ఆయన కోర్ట్ ని కోరారు. ఎలాంటి ఆరోపణలు మరోసారి చేయకుండా , శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నామని మంత్రి తరుపు న్యాయవాది కోర్ట్ ని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండ ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి పై రేవంత్ రెడ్డి ఇష్టానుసారం వాఖ్యలు చేశాడని కోర్ట్ కి వివరించారు. దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది సిటీ సివిల్ కోర్టు.

డ్రగ్స్ కేస్ లో , ఈడి కేస్ లో కే టి ఆర్ పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదు అని ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి కి నోటీసులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు… కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 20 కు వాయిధా వేసారు.

Show comments