కరోనా కొత్త పేరు ‘కొవిడ్‌ 19’..

చైనాను అతలాకుతలం చేస్తూ ప్రపంచాన్ని సైతం వణికిస్తున్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరును ప్రకటించింది. ఇకపై కొవిడ్‌–19గా పిలవాలని పేర్కొంది. కరోనా, వైరస్, డిసీస్‌ పదాల్లోని తొలి రెండు అక్షరాలతోపాటు 2019 డిసెంబర్‌ 31న ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి అన్నీ కలిపి కొవిడ్‌–19గా నామకరణం చేశారు.

ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే 1,110 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా మరో 1700 మందికి ఈ వైరస్‌ సోకింది. మొత్తంగా ఈ  వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య  45 వేలను దాటింది. 99 శాతం మంది బాధితులు ఒక్క చైనాలోనే ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 

Show comments