CM YS Jagan, OTS Scheme – ఓటీఎస్‌ పై సమీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్‌

వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)పై ప్రజల్లో అనుమానాలు నెలకొని ఉండడం, ఆ అనుమానాలను మరింత పెంచుతూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్ష టీడీపీ యత్నిస్తున్న తరుణంలో.. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ అంశంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ఓటీఎస్‌ పథకంపై ఈ రోజు సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఈ పథకంపై ప్రజలకు లోతైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఓటీఎస్‌ పూర్తిగా స్వచ్ఛందమని సీఎం జగన్‌ తెలిపారు. ఓటీఎస్‌ పథకం ద్వారా పేదలను రుణ భారం నుంచి విముక్తి చేస్తున్నామని చెప్పారు. దాదాపు పది వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నామని వివరించారు. రుణాలు మాఫీ చేయడంతోపాటు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని తెలిపారు. క్లియర్‌ టైటిల్‌తో లబ్ధిదారుల ఇళ్ల రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని చెప్పారు. ఫలితంగా ఇంటిపై లబ్ధిదారుడుకి పూర్తి హక్కులు వస్తాయని తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల ఆర్థిక అవసరాలకు ఇంటిని తనఖా పెట్టుకోవచ్చని, అవసరమైతే అమ్ముకోవచ్చని కూడా సీఎం జగన్‌ వివరించారు. ఓటీఎస్‌ ద్వారా ఇలాంటి మంచి అవకాశం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా..? లేదా..? అన్నది పూర్తిగా వారి ఇష్టమని స్పష్టం చేశారు. ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పించేలా ఈ నెల 21వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని సీఎం జగన్‌ వెల్లడించారు.

ఓటీఎస్‌ పథకంపై అవగాహనతో పట్టణ, నగర ప్రాంతాలలోని లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే భారీగా ఓటీఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే అవగాహనలేమితో ఓటీఎస్‌పై అనాసక్తి నెలకొంది. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఓటీఎస్‌ వల్ల వచ్చే ప్రయోజనాలను వివరిస్తున్నా కొంత మంది లబ్ధిదారులు అవగాహన చేసుకోలేకపోతున్నారు. దీనికి తోడు టీడీపీ, ప్రభుత్వ లక్ష్యాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజలను రెచ్చగొడుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలను ప్రచారంలో పూర్తి స్థాయిలో భాగస్వాములను చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి.

Also Read : Ap Cm Ys Jagan – పేద‌ల గుండెల్లో “గూడు” క‌ట్టుకుంటున్న జ‌గ‌న్

Show comments