CM Jagan -నా స్పీచ్ చంద్రబాబు చూడాలి, చూస్తారు: జగన్

సంక్షేమంలో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మహిళా సంక్షేమం విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఏపీ సిఎం వైఎస్ జగన్… ఇప్పుడు మహిళల కోసం మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. మహిళా సాధికారత కోసం కొత్త పథకం ప్రారంభిస్తున్నట్టు సీఎం శాసన సభలో మహిళా సాధికారితపై జరిగిన చర్చలో భాగంగా ప్రకటించారు. ఈ నెల 9వ తేదీ నుంచి మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకం తీసుకొస్తున్నామని చెప్పారు ఆయన. వైఎస్సార్ జగనన్న ఇళ్ల పథకం ద్వారా ప్రతి మహిళా లబ్దిదారుకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల విలువ కలిగిన ఆస్తిని అందచేయాలని సంకల్పించాం అని జగన్ ప్రకటించారు.

పెన్ష‌న్లు ఒక‌టో తారీఖు సెలవు దినం అయినా అందిస్తున్నాం అని మ‌హిళ‌ల సాధికారిత‌కు పెద్ద పీట వేస్తున్నాం అని స్పష్టం చేేశారు. 25 వేల కోట్లలో ఇప్ప‌టికే అందించిన ల‌బ్ది 12850 కోట్లు అన్నారు.సున్నా వడ్డీ ప‌థ‌కం క్రింద చెల్లించామని చెప్పిన జగన్…వైఎస్ఆర్ చేయూత ప‌థ‌కం మ‌హిళ‌కు ఒక ఆక్సిజ‌న్ లాగా పని చేస్తుందన్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా 4 ఏళ్ల పాటు వారికి స‌హాయం చేయడం ద్వారా  ఆర్థికంగా ఎద‌గడానికి ఉప‌యోగప‌డుతుందని స్పష్టం చేేశారు. ఎస్సీ,ఎస్ట్సీ,బిసి,మైనార్టీ అక్కా చెల్లెమ్మ‌ల‌కు చెల్లిస్తున్నామని చెప్పిన జగన్ డ‌బ్బులు ఇవ్వ‌డంతో పాటు ఆర్థికంగా వ్యాపారం ప‌రంగా అభివృద్ది చేయ‌డానికి పెద్ద సంస్థ‌ల భాగస్వామ్యం చేశామన్నారు. 31 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాలు.. కోటి 25 ల‌క్ష‌ల మందికి ల‌బ్ది చేకూరుతుందని తెలిపారు.

17వేల పైగా జ‌గ‌నన్న కాల‌నీలు కొత్త‌గా త‌యారు కానున్నాయని 15 ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్లు ప్రారంభ‌మ‌య్యాయని వివరించారు. మ‌హిళా సాధికార‌త అంటే వారిని అభివృద్ది చేయ‌డమని అభిప్రాయపడ్డారు. వారికి ఇళ్లు కూడా క‌ట్టించి ఇస్తే 2 నుండి 3 లక్ష‌ల కోట్లు ఆస్తి అవుతుందన్నారు ఆయన. ఇలాంటి ప‌నులు చేస్తుంటే కోర్టు కు వెళ్లి అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు. అలాంటి వారికి దేవుడు మొట్టికాయలు వేస్తాడని అందుకే కుప్పంలో దేవుడు వారికి మొట్టికాయ‌లు వేశాడన్నారు. ప్ర‌తి క్వార్ట‌ర్ లో పిల్ల‌ల ఫీజులు క‌ట్టేలా జ‌గ‌న‌న్న విద్యాదీవెన క్రింద 2269 కోట్ల రుపాయిలు 15.56 ల‌క్ష‌ల మంది త‌ల్లుల ఖాతాలో వేస్తున్నాం అని పేర్కొన్నారు.

పిల్లాడు తల్లి గ‌ర్భంలో ఉన్న‌నాటి నుండి పిల్ల‌ల గురించి ఆలోచించే ప్ర‌భుత్వం మ‌న‌దన్న జగన్ వైఎస్ఆర్ కాపు నేస్తం 3.27 ల‌క్ష‌ల మంది మహిళ‌ల‌కు 981 కోట్లు ఇస్తున్నామని అలాగే జ‌న‌వ‌రి 9న ఈబీసి నేస్తం ప‌థ‌కం ప్రారంభింస్తున్నామని చెప్పారు. మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్నట్టు వివరించారు. మ‌హిళ‌ల‌ను మ‌హా‌రాణులుగా తీర్చిదిద్ద‌డం ప్ర‌భుత్వం ల‌క్ష్యమని స్పష్టం చేేశారు. రాష్ట్ర హోం మంత్రి గా ఎస్సీ మ‌హిళ‌ను చేశామని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మీష‌న‌ర్ గా తొలిసారి గా ఒక మ‌హిళ‌ను చేశామని గుర్తు చేసారు. నామినేటేడ్ పోస్టుల్లో కూడా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న 53 శాతం మ‌హిళా వాలెంటీ‌ర్లుగా ఉన్న‌వాళ్లు చెల్లెళ్లే అని స్పష్టం చేేశారు. దిశా చ‌ట్టం చేసి అమోదం కోసం కేంద్రానికి పంపామన్నారు. కేంద్రం కోరిన ప‌లు అంశాల‌కు స‌మాధానాలు పంపామని వివరించారు.తన ప్రసంగం కచ్చితంగా చంద్రబాబు నాయుడు చూడాలని, చూస్తారని అనుకుంటున్నా అంటూ తన మార్క్ సెటైర్ లు వేశారు.

Show comments