Bjp central minister,warns to kcr -ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, కేసీఆర్ కు కేంద్రం వార్నింగ్…?

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలు ఏ మలుపు తిరుగుతాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ తరుణంలో తెలంగాణా సిఎం కేసీఆర్ ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సంచలనాలకు వేదిక అయింది. దీనికి కేంద్ర జలశక్తి శాఖా మంత్రి సమాధానం ఇచ్చారు. కేసీఆర్ కొన్ని రోజులుగా మీడియా సమావేశాల్లో నా పేరు ప్రస్తావించారు అని ఆయన లేవనెత్తిన పలు అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు, దేశానికి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందన్నారు.

కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు విషయం పై కేసీఆర్..సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించారు అని ఆయన పేర్కొన్నారు. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని తెలిపారు మంత్రి. ఇద్దరు సీఎంలతో కలిసి అపెక్స్ కొన్సిల్ సమావేశం జరిగింది అన్నారు. చాలా కాలం నుంచి జరగాల్సిన సమావేశాన్ని చొరవ తీసుకుని ఏర్పాటు చేశాము అని ఆయన వివరించారు. ఆ భేటీలో నేనే స్వయంగా.. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో చర్చించానని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ 2020 అక్టోబర్ 6న జరిగిన భేటీ తర్వాత రెండు రోజుల్లోనే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పారని వివరించారు. సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకునేందుకు దాదాపు 8 నెలలు… పట్టింది అన్నారు. నెలా 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు అంగీకరించింది అన్నారు. అప్పటి నుంచే కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైంది అని పేర్కొన్నారు. 7ఏళ్ల పాటు ఆలస్యం కావడానికి నేనెలా, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుంది అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఆరోపించుకుంటున్నారు అని పేర్కొన్నారు.

Also Read : KCR, KRMB, GRMB – ప్రాజెక్టుల అప్పగింత.. క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌

ఇద్దరి మధ్య తదుపరి ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది అన్నారు ఆయన. ప్రధాని కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు అని తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించిన అంశాలపై ఇష్టం వచ్చిన రీతిలో ఎలా మాట్లాడుతారు అని ప్రశ్నించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు విషయం పై కేసీఆర్.. సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించారు అని పేర్కొన్నారు. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని ఆయన తెలిపారు. ఇద్దరు సీఎంలతో కలిసి అపెక్స్ కొన్సిల్ సమావేశం జరిగింది అని మంత్రి వివరించారు.

కొత్తది ఏర్పాటు చేయాలా లేక పాత దాన్నే కొనసాగించాలా అన్నది నిర్ణయం జరగాలి. బోర్డుల కోసం మేము ఆల్రెడీ డేట్ ఇచ్చాము అని చెప్పిన మంత్రి ఆలోగా బోర్డుల నిర్వహణకు తగిన వసతులు కల్పించాలన్నారు. బోర్డుల నిర్వహణకు పరస్పర అంగీకారంతో వాయిదా వేయడానికి అభ్యంతరం లేదు అన్నారు. నిజానికి వాయిదా వేయాల్సిన అవసరం లేదు అని… పరస్పరం మాట్లాడుకుని ఎలా అమలు చేయాలన్నది ఆలోచించాలి అని ఆయన సూచించారు. విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్న మంత్రి… నోటిఫికేషన్ లో పూర్తి స్పష్టత ఉందన్నారు.

Also Read : KCR Press Meet – ధాన్యం కొనుగోలు, పెట్రోల్‌ ధరలు.. కేంద్రాన్ని ఉతికి ఆరేసిన కేసీఆర్

Show comments