cm jagan – జ‌గ‌న్ ‘లెక్క‌’.. ఇక‌ ప‌క్కా

అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు అసెంబ్లీ ఇష్యూను హైలెట్ చేస్తూ.. ప్ర‌జ‌ల్లో నానేలా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. వ‌ర‌ద బాధితుల బాధ‌ల‌ను తెలుసుకోవాల్సిందిపోయి.. అక్క‌డ కూడా త‌న బాధ‌నే చెప్పుకుంటున్నారు. చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిపై ఇప్ప‌టికే ప్ర‌జ‌లు ఓ లెక్క‌కు వ‌చ్చేశారు. ఆరంభం రోజు అయ్యో పాపం అన్న‌వారు కూడా.. ఎందుకిలా ఆయ‌న ప‌రువు ఆయ‌నే ప‌దేప‌దే తీసుకుంటున్నారు అని చ‌ర్చించుకుంటున్నారు. జ‌నం మాట అటుంచితే ప్ర‌తిప‌క్ష నేత ఆరోప‌ణ‌ల‌కు క‌ళ్లెం వేసేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా ప‌క్కాగా స‌మాధానం చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టున్నారు. ఆరోప‌ణ‌లు, అంశం ఏదైనా లెక్క‌ల‌తో స‌హా ప‌క్కాగా కౌంట‌ర్ లు ఇస్తున్నారు. అందుకు మునెమ్మ ఇష్యూను ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు.. స‌హాయం పంపిణీలో కూడా ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాబు ప్ర‌య‌త్నాల‌కు సీఎం జగన్.. అసెంబ్లీ వేదిక‌గానే కౌంట‌ర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు వరదలతో సీమలోని జిల్లాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను ఓదార్చే ప్రయత్నం బాగానే ఉన్నా.. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకుంటున్నారు. అయితే.. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోనూ చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో ఇందుకూరు పేట మండలం గంగపట్నంలో బాధితుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటికి వెళ్లిన చంద్రబాబుకు అక్కడి మునెమ్మ అనే మహిళ.. తన ఇల్లు వరదలు వర్షాలతో కూలిపోయిందని.. ప్రభుత్వం ఆదుకోలేదని.. కన్నీరు పెట్టుకుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

ఈ విషయాన్ని ప‌చ్చ‌ మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. దీంతో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై.. స్వయంగా సీఎం జగన్ సభలో స‌వివ‌రంగా చెప్పారు. నిజంగానే నెల్లూరులో ఏం జరిగిందనే విషయాన్ని జగన్ సభలో వివరించారు. మునెమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుందని.. సీఎం జగన్ తెలిపారు. మునెమ్మ నివాసం ఉంటున్న ఇల్లు పక్కా గృహమని.. ఈ ఇంటికి అదనంగా ఏర్పాటు చేసుకున్న పంచ మాత్రమే.. వరదల్లో కొట్టుకుపోయిందని.. దీనినే చంద్రబాబు చూసి.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారని.. జగన్ ఆక్షేపించారు. పక్కా ఇల్లుకావడం.. ఇంటికి ఎలాంటి నష్టం కలగకపోవడంతో.. మరో ఇల్లు కట్టించే అవకాశం లేదన్న జగన్… అయితే.. ఇప్పటికే ఈ మునెమ్మ కుటుంబానికి బియ్యం నిత్యావసరాలు.. సహా ఆమెకు ఆమె భర్తకు కలిపి 4200 రూపాయలు పరిహారంగా అందించామని వివరించారు.

దీనికి సంబంధించిన రసీదు కూడా ఉందని.. ఈ విషయం తెలుసుకోకుండానే.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. ఏంటని ప్రశ్నించారు. తన హయాంలో బియ్యం ఇస్తేనే గొప్ప అనుకున్న చంద్రబాబు.. ఇప్పుడు.. తాము బియ్యంతోపాటు నగదు కూడా ఇస్తున్న విషయాన్ని తెలుసుకోకుండా.. ఆరోపణలు చేస్తున్నారని.. మండిపడ్డారు. ఈ సందర్భంగా మునెమ్మకు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎలాంటి సాయం చేసిందనే విషయంపై.. సీఎం తారీకుల వారీగా వివరాలను సభకు వివరించారు. లెక్క‌ల‌తో జ‌గ‌న్ చెబుతున్న ప‌క్కా వివ‌ర‌ణ‌ల‌కు స‌భ్యులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

Show comments