Postal Ballot Result – అధికార పార్టీలకే అధికారుల ఓట్లు

హుజురాబాద్, బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్‌ బ్యాలెట్‌తో లెక్కింపు మొదలైంది. రెండు చోట్లా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. హుజురాబాద్‌లో 753 ఉండగా.. టీఆర్‌ఎస్‌కు 503 ఓట్లు, బీజేపీకి 159, కాంగ్రెస్‌కు 32 ఓట్లు వచ్చాయి. మరో 14 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈవీఎం ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు.

బద్వేల్‌లోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ నియోజకవర్గంలో 225 పోస్టల్‌ బ్యాలెట్లను అధికారులు జారీ చేశారు. అయితే ఇందులో ఎన్ని పోలయ్యాయి..? ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి..? అనే విషయం కౌటింగ్‌ అధికారులు వెల్లడించలేదు. కౌంటింగ్‌ పూర్తయినా.. పోస్టల్‌ ఫలితం వెల్లడించకపోడానికి కారణాలు కూడా తెలియరాలేదు. అయితే పోస్టల్‌ బ్యాలెట్లలో అధికార వైసీపీకి ఆధిక్యం వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : Badvel,Huzurabad By Polls -. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ , బద్వేల్ లో మెజారిటీ.. హుజూరాబాద్ లో గెలుపు పై ఉత్కంఠత

Show comments