Central government – పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రం ప్లాన్ ఏంటంటే..?

పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అయితే.. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను కాకుండా, ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేలా వ్యూహాలు ప‌న్నే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే.. వ‌చ్చే ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల‌లో గెల‌వ‌డ‌మే ఎజెండాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ నిర్ణ‌యాలు ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇందుకోస‌మే నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మోదీ.. స‌మావేశాల తొలిరోజే ఆ తీర్మానాన్ని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.

విచిత్రం ఏంటంటే.. చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న బిల్లును ఎలా ఆమోదించారో.. మూజువాణి ఓటుతో ర‌ద్దు బిల్లుకు కూడా లోక్‌సభ ఆమోదం తెల‌ప‌డం.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 వరకు జరగనున్నాయి. స‌మావేశాలు చివ‌రి వ‌ర‌కూ బీజేపీ ఎంపీలు స‌భ‌లో హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌నే సంకేతాల‌ను కేంద్ర పెద్ద‌లు పంపిన‌ట్లు తెలిసింది.

స‌మావేశాల ప్రారంభానికి ముందు మోదీ మాట‌లు కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. పార్లమెంటులో అన్ని ప్రశ్నలను ఎదుర్కొని, సమాధానం చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అయితే సభ గౌరవాన్ని, సభాపతి సమగ్రతను, హుందాతనాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి సామాన్య పౌరుడు ఈ పార్లమెంటు సమావేశాలు గమనిస్తారని, వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవల్సిన అవసరం ఉందంటూ సూచించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. పార్లమెంటు దేశ ప్రయోజనాల కోసం చర్చలు జరపాలని, దేశాభివృద్ధి కొరకు కొత్త మార్గాలను కనుగొనాలని ప్రధాని అన్నారు.

Also Read : AAP, Punjab Elections – ఊడ్చేయనుందా..? నాలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న ఆప్‌..!

ఈ పార్లమెంటు సభా కార్యకలాపాలు సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు మోడీ తెలిపారు. ఈ సమావేశాల్లో సకారాత్మక కృషి జరగడం ముఖ్యమని చెప్పారు. పార్లమెంటులో చర్చించాలని, సభ గౌరవ, మర్యాదలను కాపాడాలని చెప్పారు. వాయిదాలు, అంతరాయాలు కాకుండా అర్థవంతమైన చర్చ జరిగిందని ఈ సమావేశాలు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని ఆకాక్షించారు.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పినంత మాత్రాన పార్లమెంటు గౌరవానికి, స్పీకర్ గౌరవానికి సంబంధించి, రాబోయే రోజుల్లో దేశంలోని యువ తరానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలని మోదీ అన్నారు. బలవంతంగా పార్లమెంట్‌ కార్యకలాపాలను ఆపడం ప్రమాణం కాదన్నారు.“పార్లమెంటు ఎన్ని గంటలు కొనసాగింది అనేది ప్రమాణం. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తులో పార్లమెంట్‌ను ఎలా నడపాలి, మీరు ఎంత బాగా సహకరించారు, ఎంత సానుకూలంగా పని చేశారు.. ఆ స్థాయిలోనే బేరీజు వేసుకోవాలన్నారు. పార్లమెంటు హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎంపీపైన ఉందన్నారు.

అలాగే ఈ స‌మావేశాల ద్వారా కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన కీల‌క ప‌థ‌కాలు, వాటి ఫ‌లితాల‌పై చ‌ర్చ జ‌రిగేలా చూసేందుకు బీజేపీ ఎంపీలు కృషి చేయ‌నున్నారు. దీంతోపాటు మున్ముందు చేప‌ట్ట‌బోయే కీల‌క నిర్ణ‌యాల‌ను కూడా వెల్ల‌డించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌టికే సాధించిన ఘ‌న‌త‌పై మోదీ వివ‌రించారు. గత సెషన్ తర్వాత, కరోనా విపత్కర పరిస్థితిలో కూడా, దేశం 100 కోట్ల కంటే ఎక్కువ మోతాదుల కరోనా వ్యాక్సిన్‌ల సంఖ్యను దాటిందని, భారత్ 150 కోట్ల డోస్‌ల దిశగా పయనిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంక్షోభ సమయంలో మీ మంచి ఆరోగ్యమే మా ప్రాధాన్యత అన్నారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల ప‌థ‌కాన్ని మార్చి 2022 వరకు పొడిగించామ‌ని ప్ర‌క‌టించారు. దాదాపు రూ.2.60 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ సెషన్‌లో మనం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని ముందుగానే చెప్పారు. ఇలా దేశాభివృద్ధికి తాము చేప‌ట్ట‌బోతున్న కీల‌క అంశాల‌ను స‌భ‌లో ప్ర‌స్తావించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌న‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read : Bjp, Yogi – యోగి ఓకే.. బీజేపీ నాట్ ఓకే! -యూపీ ఓటర్ల తాజా మనోగతం

Show comments